సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే నిర్మాత ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu) తండ్రి, సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) తండ్రి, దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ (Surya Kiran), ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్, త్రినాథ్ రావు నక్కిన (Trinadha Rao Nakkina) తండ్రి నక్కిన సూర్యారావు, సీరియల్ నటి పవిత్ర జయరాం, మరో సీరియల్ నటుడు చందు, దర్శకుడు సూర్య ప్రకాష్ వంటి వారు కన్నుమూశారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. సినీ పరిశ్రమలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ జానీ వాక్టర్ ని కొంతమంది దుండగులు కాల్చి చంపేశారు. అమెరికాలో శనివారం నాడు ఉదయం లాస్ ఏంజిల్స్ డౌన్ టౌన్ లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ముగ్గురు వ్యక్తులు వాక్టర్ కారు వద్దకి వచ్చి కాటలిక్ట్ కన్వర్టర్ ని దొంగిలించడానికి ప్రయత్నించారట. అప్పుడు వాక్టర్ వాళ్ళను అడ్డుకుని తలపడే ప్రయత్నం చేశాడు.
దీంతో దుండగులు తుపాకులతో వెక్టర్ పై కాల్పులు జరపగా అతను ఘోరంగా గాయపడ్డాడట. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లినా అతను కోలుకోలేదని.. చికిత్స పొందుతూనే అతను మరణించాడని’ అతని కుటుంబ సభ్యులు తెలిపారు.ఇక నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని.. పోలీసులు వారి కోసం గాలిస్తున్నట్లు కూడా వాక్టర్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక 37 ఏళ్లకే వాక్టర్ మరణించడం నిజంగా విషాదకరమనే చెప్పాలి.