Waltair Veerayya: పవన్ కళ్యాణ్ సినిమా కోసం ‘వాల్తేరు వీరయ్య’ ని వదిలేసుకున్న నటుడు ఎవరంటే..!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ‘పవర్’ బాబీ డైరెక్ట్ చేశాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్ర పోషించాడు. కేథరిన్.. రవితేజకి జోడీగా నటించింది. ఇక ఈ చిత్రంలో విలన్ గా ప్రకాష్ రాజ్ నటించాడు.

అతను ఈ చిత్రంలో (Waltair Veerayya) మైఖేల్ సీజర్ అలియాస్ కాలా పాత్రలో కనిపించాడు. చిరంజీవి పక్కనే ఉంటూ అతని తమ్ముడు రవితేజని మర్డర్ చేసే పాత్ర ఇది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటన పరమ రొటీన్ గా ఉందనే కామెంట్స్ కూడా సినిమా రిలీజ్ టైంలో వినిపించాయి. ప్రకాష్ రాజ్ గతంలో చేసిన పాత్రల్లానే ఈ పాత్ర కూడా ఉంది అని అందరూ విమర్శించారు కూడా..! అయితే ఈ పాత్రకి మొదట అనుకున్న నటుడు ప్రకాష్ రాజ్ కాదట.

మొదట ఈ పాత్రకి సముద్రఖని ని ఎంపిక చేసుకున్నాడట దర్శకుడు బాబీ. లుక్ టెస్ట్ అంతా అయిపోయింది.. ఇక షూటింగ్ కు వెళ్లడమే తరువాయి అనుకున్న టైంలో సముద్రఖనిలో ఏదో వెలితి కనిపించిందట బాబీ. ఈ విషయం అతను సముద్రఖనిని ఆరా తీయగా.. పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.. అని చెప్పాడట.

దీంతో బాబీ .. తాను కూడా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానిలా అలోచించి .. వెళ్లి హ్యాపీగా ఆ సినిమా షూటింగ్ చేసుకోండి.మనం భవిష్యత్తులో ఇంకో సినిమాకి పని చేద్దాం అని చెప్పాడట. ఈ విషయాన్ని బ్రో సక్సెస్ మీట్ లో ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ చెప్పుకొచ్చాడు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus