సంగీత దర్శకుడు, సింగర్ అయిన బిప్పీ లహరి మరణవార్తతో విషాదంలోకి వెళ్ళిపోయిన సినీ పరిశ్రమకి ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ మరింత ఇబ్బంది పెడుతుంది. విషయంలోకి వెళ్తే.. ప్రముఖ పంజాబీ నటుడు అయిన దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈయన వయసు కేవలం 38 సంవత్సరాలు మాత్రమే కావడం బాధాకరం.మంగళవారం రాత్రి హర్యానాలోని సోనిపట్ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి భటిండా వైపు కుండ్లీ-మానెసార్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే పై వెళ్తున్న సిద్దూ స్కార్పియో కారు..
నిలిపి ఉన్న ఓ లారీని ఢీ కొట్టింది.ఆ స్కార్పియో ఎదుటి భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది.స్థానికులు సిద్దూని హాస్పిటల్ కు తీసుకెళ్ళగా అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. మితిమీరిన వేగం కారణంగానే ఈ ఘోర ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.సిద్దూతో పాటు ఈ కారులో అమెరికా నుండీ వచ్చిన అతని ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారట.వీరిలో సిద్ధూతో పాటు ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది. 2021 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో సాగు చట్టాల రద్దు డిమాండ్‌తో రైతులు ఢిల్లీలో చేసిన ట్రాక్టర్ల ర్యాలీలో సిద్ధు కూడా పాల్గొని హాట్ టాపిక్ అయ్యాడు.
ఆ టైములో ఎర్రకోట పై దాడి చేసిన రైతులను ప్రేరేపించింది సిద్ధూ అంటూ అతని పై కేసు కూడా నమోదైంది.దీంతో ఫిబ్రవరి 9న అతన్ని హరియాణాలోని కర్నాల్‌లో అరెస్టు చేయడం కూడా జరిగింది. తర్వాత బెయిల్ పై అతని పై బయటికి వచ్చినా, చార్జిషీటు దాఖలు కావడంతో మళ్ళీ అతన్ని మేలో అరెస్టు చేశారు. పంజాబ్‌లోని ముక్త్‌సర్‌కు చెందిన సిద్దూ దీప్ నటుడు కాకముందు లాయర్‌గా కూడా పని చేశారట.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!