రిలేషన్‌ షిప్‌ స్పందించిన కుర్ర హీరో

బాలీవుడ్‌ కపుల్స్‌లో డిఫరెంట్‌ కపుల్‌ అంటే… అర్జున్‌ కపూర్‌ – మలైకా అరోరానే. అంత డిఫరెంట్‌ ఏంటి అంటే… ఇద్దరి మద్య ఏజ్ గ్యాప్‌. మలైకా కంటే అర్జున్‌ కపూర్‌ 12 ఏళ్లు కావడమే. చాలా రోజుల నుండి బాలీవుడ్‌ మీడియాలో ఈ విషయమ్మీదే చర్చ నడుస్తోంది. వారి రిలేషన్‌పై గతంలో మలైకా ఒకటి రెండుసార్లు పరోక్షంగా స్పందించినా… అర్జున్‌ కపూర్‌ మాత్రం ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ ఇటీవల అర్జున్‌ కపూర్‌ తొలిసారి తమ రిలేషన్‌ గురించి, ఏజ్‌ గ్యాప్‌ ఫ్యాక్టర్‌ గురించి మాట్లాడాడు. అందరూ ఊహించినట్లుగానే ‘ఏజ్‌ గ్యాప్‌’ గురించి స్పందించాడు.

అర్జున్‌, మలైకా… చాలా రోజులగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ పక్షులు విదేశాలకు టూర్లకు వెళ్తుంటారు. మన దేశంలోనూ వివిధ ప్రాంతాల్లో విహరిస్తుంటారు. సాధారణ ప్రజల్లా రెస్టరెంట్లకు తిరుగుతుంటారు. అలా వారు కనిపించినప్పుడల్లా వారి ప్రేమ వ్యవహారం గురించి రాస్తుంటారు. ఆ వెంటనే ఏజ్‌ ఫ్యాక్టర్‌ అనే టాపిక్‌ కూడా తీసుకొస్తారు. దీనిపై సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ కూడా జరుగుతుంటుంది. ఇలాంటి ట్రోల్స్‌పై పెద్దగా స్పందించని అర్జున్‌ ఇటీవల మౌనం వీడాడు.

బంధాలకు సంబంధించి ఏజ్‌ గ్యాప్‌ అస్సలు అడ్డు కాదు. దానిని ఏ రకంగానూ అడ్డుగా చూపొద్దు. రిలేషన్‌ విషయంలో ఎవరి వయసు ఎంత అనే దాని గురించి బాధపడకూడదు. ఎవరి జీవితాలు వారివి అనేది నా ఆలోచన. మనుషుల్ని జీవించాలి, జీవించనివ్వాలి. మా విషయంలో నెటిజన్లు చేసే కామెంట్లను మీడియా పెద్దగా చేసి చూపిస్తుంటుంది. వాటిలో 90 శాతం కామెంట్లను మేం చూడం. కాబట్టి ట్రోల్స్‌కు అస్సలు ఇంపార్టెన్స్‌ ఇవ్వను. ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజానికి వాటిలో చాలావరకు తప్పుడు సమాచారమే ఉంటుంది అని అన్నాడు అర్జున్‌ కపూర్‌.

నన్ను ట్రోల్‌ చేసేవారు ఎప్పుడైనా నన్ను కలిసినప్పుడు.. నాతో సెల్ఫీ దిగడానికి సిద్ధమవుతుంటారు. అందుకే, అలాంటి వాళ్లను అస్సలు నమ్మకూడదు. నా జీవితంలో నేను చేసే ప్రతి పని… నా హక్కు అని భావిస్తాను. నేను చేసే పనికి గుర్తింపు లభించేంత కాలం.. మిగతా విషయాలు నా దృష్టిలో వేస్ట్ అని నా అభిప్రాయం అంటూ ట్రోల్స్‌ను కొట్టిపారేశాడు అర్జున్‌ కపూర్‌.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus