హీరోకి చిరాకు తెప్పించే ప్రశ్న.. అయినా తెలివిగా సమాధానమిచ్చాడు..!

ఎఫైర్, లవ్, డేటింగ్ అనే వ్యవహారాలు మనకి వింతగా,ఆశ్చర్యం గా అనిపిస్తాయి కానీ.. బాలీవుడ్ సెలబ్రిటీలకు, ప్రేక్షకులకు ఇవి సర్వసాధారణమైన విషయాలు అనే చెప్పాలి. అందులోనూ ఎక్కువ ఏజ్ ఉన్న నటీమణులు తక్కువ ఏజ్ ఉన్న నటులతో డేటింగ్ చేయడం మనకు విడ్డూరంగా అనిపించినా.. అది అక్కడి జనాలకు అసలు మేటర్ కాదు. ప్రియాంక చోప్రా తనకన్నా పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనస్ తో డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంది.ఇక హీరోయిన్ సుస్మితాసేన్ కూడా ప్రస్తుతం ఓ యువకుడితో సహ జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే.

వీరి బాటలోనే ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన సెక్సీ బ్యూటీ మలైకా కూడా అడుగులు వేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె హీరో అర్జున్ కపూర్ తో కొన్నేళ్ళుగా సహ జీవనం సాగిస్తుంది. ఈ వార్తలతో ఈమె ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. అర్భాజ్ ఖాన్ తో విడాకులైన తర్వాత.. మలైకా, అర్జున్ కపూర్ మధ్య ఎఫైర్ మొదలైంది.అప్పటికే ఆమెకు కొడుకు కూడా ఉన్నాడు. మలైకా కన్నా 12 ఏళ్ళ చిన్నవాడు అర్జున్ కపూర్. 2019 నుండి వీళ్ళు సహ జీవనం సాగిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వీరి వ్యవహారానికి సంబంధించి హీరో అర్జున్ కపూర్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి.

గతంలో పెళ్ళై ఓ కొడుకుకి తల్లైన మహిళతో డేటింగ్ చేయడం పట్ల మీరు ఎలా స్పందిస్తారు? అని అర్జున్ ను ప్రశ్నించాడు యాంకర్.దీనికి అర్జున్ జవాబిస్తూ.. ‘నా పర్సనల్ విషయాల గురించి నేను ఎక్కువగా మాట్లాడను. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను.అదేంటి అంటే.. మన భాగస్వామికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆమె గతం గతం.!దానికి మనం ఏమీ చేయలేము.అందుకని ఆమెకు హద్దులు పెట్టడం.. ఆమె కోరుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వకుండా ఆపెయ్యడం అనేది పెద్ద తప్పు. ఇలా పర్సనల్ విషయాల గురించి బయట మాట్లాడడం వల్ల పిల్లల పై ఎఫెక్ట్ పడుతుంది.అయితే నేను ఆమె కంఫర్టబుల్ గా ఫీలయ్యేలా ప్రవర్తించగలను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus