ఆ సమస్య వల్ల మృతి చెందిన ప్రముఖ నటుడు.. ఏమైందంటే?

ఈ మధ్య కాలంలో సినీ, టీవీ ఇండస్ట్రీలలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేర్వేరు ఆరోగ్య సమస్యల వల్ల ప్రముఖ నటులు మృతి చెందుతుండటం అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది. మరాఠీ టీవీ సీరియల్స్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న అరవింద్ ధను బ్రెయిన్ హెమరేజ్ వల్ల మృతి చెందారు. సుఖ్ మ్హంజే నక్కీ కే అస్తా అనే సీరియల్ ద్వారా ఈ నటుడికి ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది.

అరవింద్ ధను ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్న సమయంలో అసౌకర్యంగా అనిపించిందని ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ఆరోగ్యం విషమించడంతో ఆయన మరణించారని సమాచారం అందుతోంది. ఏక్ హోతా వాల్యా అనే మరాఠీ మూవీ అరవింద్ ధనుకు మంచి పేరును తెచ్చిపెట్టింది. అరవింద్ ధను మరణ వార్త గురించి తెలిసి ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన నటనతో అరవింద్ ధను ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. సినీ, టీవీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అరవింద్ ధను మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

చిన్న పాత్రలో నటించినా ఆ పాత్రకు కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేసి ప్రశంసలను అందుకున్న అతికొద్ది మంది నటులలో అరవింద్ ధను కూడా ఒకరు కావడం గమనార్హం. సుఖ్ మ్హంజే నక్కీ కే అస్తా సీరియల్ లో పొలిటీషియన్ రోల్ లో అరవింద్ ధను నటించారు. అరవింద్ ధను ఎల్లప్పుడూ ఇతరులకు మంచి జరగాలని కోరుకునే వారని ఎవరికీ అపాయం చేయని అతికొద్ది మందిలో అరవింద్ ధను ఒకరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సినిమాలలో చిన్న పాత్రల్లోనే ఎక్కువగా నటించిన అరవింద్ ధను సీరియళ్లలో మాత్రం ప్రధాన పాత్రల్లో నటించారు. క్రైమ్ పెట్రోల్, లేక్ మాఝీ లడ్కీ సీరియళ్లు కూడా అరవింద్ ధనుకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus