సెలబ్రిటీలు అన్నాక.. వారి పై గాసిప్స్ రావడం సహజమే. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళు అనే సరికి వారి మీద బోలెడన్ని పుకార్లు, ఊహాగానాలు పుట్టుకొస్తాయి. ఒక్కోసారి ఇవి శృతి మించుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరీ ఘోరంగా కొంతమంది నటీనటులు బ్రతికున్నప్పటికీ చనిపోయారు అంటూ వార్తలు రావడం మనం ఎన్నో చూసాం. షకీలా వద్ద నుండి చంద్రమోహన్, మహేష్ ఆచంట వంటి నటీనటులు ఎందరికో ఈ చేదు అనుభవం ఎదురైంది.
అయితే వీళ్ళు ఈ విషయం పై చాలా మెచ్యూర్డ్ గా స్పందించి కామ్ అయ్యారు. అయితే తాజాగా ఓ సీనియర్ నటుడిపై కూడా ఇలాంటి ప్రచారం జరిగింది. అయితే అతను సోషల్ మీడియా వేదికగానే ఎంతో ఆవేదన వ్యక్తం చేసాడు. వివరాల్లోకి వెళితే.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆ సీనియర్ నటుడు బ్రతికుండగానే చనిపోయాడు అంటూ థంబ్ నెయిల్స్ పెట్టారట.దీంతో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యి.. ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
అతను మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటుడు ప్రేమ్ చోప్రా. ఆయన మాట్లాడుతూ.. “నేను చనిపోయాను అంటూ ఎవరు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు.నా బంధుమిత్రులంతా నాకు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు.కొంతమంది నా మాట విని ఫోన్ కట్ చేస్తున్నారు. గతంలో నా ఆప్తమిత్రుడు జితేంద్ర కూడా బ్రతికుండగానే మరణించాడు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు నా మీద పడ్డారు. ఇక ఈ చెత్త వాగుడు ఆపండి.
నేను చనిపోయాను పుకార్లు పుట్టించి.. దానిని వైరల్ చేసి.. రాక్షసానందం పొందుతున్నారు. దీన్నే శాడిజం అని ఆంగ్లంలో అంటారు” అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. ఇక ప్రేమ్ చోప్రా సినీ కెరీర్ ను పరిశీలిస్తే ఆయన 380కిపైగా సినిమాల్లో నటించారు. ‘దోస్తానా’, ‘ఉపకార్’, ‘పురబ్ ఔర్ పశ్చిమ్’, ‘దో రాస్తే’,’క్రాంతి’, ‘జాన్వర్’,వంటి చిత్రాల్లో అతను నటించాడు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!