సినీ పరిశ్రమలో మరో విషాదం..అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు!

వరుస ప్రమాదాలు, మరణాలు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.. 2023 ఏడాదిలో 3 నెలలు గడువకముందే కె. విశ్వనాథ్, జమున, వాణీ జయరాం, తారక రత్న, మలయాళీ యంగ్ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్, టాలీవుడ్ కెమెరా మెన్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సతీష్ కౌశిక్, నటి మాధురి దీక్షిత్ తల్లి, ప్రముఖ మరాఠీ నటి భాగ్యశ్రీ మోటే సోదరి మధు మార్కండేయ మరణించారు..

ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ మరో ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సమీర్ ఖాఖర్ కన్నుమూశారు.. ఆయన వయసు 71 సంవత్సరాలు.. నటన నుంచి చిన్న విరామం తీసుకుని కొద్ది రోజులుగా యూఎస్ఎలో ఉన్న సమీర్ ఇటీవలే ఇండియా వచ్చారు.. శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తుండగా.. పలు అవయవాల పనితీరు నిలిచిపోవడంతో బుధవారం (మార్చి 15) తెల్లవారు ఝామున 4:30 గంటలకు తుదిశ్వాస విడిచారని సమీర్ కజిన్ గణేష్ ఖాఖర్ తెలియజేశారు..

38 సంవత్సరాల కెరీర్‌లో పలు సీరియల్స్, కమల్ హాసన్ ‘పుష్పక విమానం’, సల్మాన్ ఖాన్ ‘జై హో’ సూపర్ హిట్ సినిమాలు చేశారు సమీర్.. ‘నుక్కాడ్’ అనే ధారావాహికలో ‘ఖోప్డి’ అనే తాగుబోతు క్యారక్టర్‌తో పాపులర్ అయ్యారు.. యూఎస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. మంచి రోల్స్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పిన సమీర్ ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus