సినిమా కోసం హఠాత్తుగా బరువు తగ్గిన హీరో.. ఎవరా హీరో? ఏంటా కథ!

సినిమాలోని పాత్ర కోసం బరువు పెరిగిన నటుల్ని చూసుంటారు. మూవీ క్యారెక్టర్‌ కోసం వెయిట్‌ తగ్గిన వాళ్లను కూడా చూసుంటారు. అయితే పది రోజుల్లో సుమారు 10 కిలోల బరువు తగ్గినవాళ్లను చూశారా? మాకు తెలిసి ఇంత వేగంగా బరువు తగ్గడం చాలా అరుదు. కానీ ప్రముఖ హీరో శింబు ఇలాంటి పని చేసి చూపించాడు అని సమాచారం. ఈ మేరకు గత కొన్ని రోజులుగా కోడంబాక్కం వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ వార్తలు నిజమైతే శింబు పాటించిన టిప్స్‌, ఆ సీక్రెట్‌ ఏంటో తెలుసుకోవాల్సిందే.

Simbu

టాలెంట్‌కి ఏమాత్రం కొదవ లేకపోయినా.. వివాదాలు, వ్యక్తిగత విషయాల కారణంగా ఇంకా అనుకున్న స్థాయికి ఎదగలేకపోయాడు శింబు. అయితే సినిమా అన్నా, పాత్రలు అన్నా తన వంద శాతం ఎఫెర్ట్‌ పెడుతూ ఉంటాడు. ఇప్పుడు తన కొత్త సినిమా విషయంలోనూ అదే చేశాడు అని అంటున్నారు. వెట్రిమార‌న్‌తో శింబు ఓ సినిమా చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా కోసం శింబు అర్జెంట్‌గా బరువు తగ్గాడు అని అంటున్నారు.

‘థ‌గ్ లైఫ్‌’ సినిమాలో శింబు కాస్త సన్నగానే కనిపించాడు. అయితే తన హీరో ఇంకా సన్నగా ఉండాలని వెట్రిమారన్‌ అనడంతో ఇప్పుడు మరింత తగ్గే పనిలో పడ్డాడట. ఈ క్రమంలో పది రోజుల్లో పది కిలోల బరువు తగ్గాడు అని చెబుతున్నారు. ఈ సినిమా ‘వ‌డ చెన్నై’ బ్యాక్ డ్రాప్‌లోనే ఉంటుందని సమాచారం. ధ‌నుష్‌తో ‘వ‌డ చెన్నై’ సీక్వెల్ తీయాల‌ని వెట్రిమారన్‌ చాలా ఏళ్లుగా ట్రై చేస్తున్నారు. కానీ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో అదే బ్యాక్‌డ్రాప్‌లో వేరే క‌థ‌తో శింబు హీరోగా సినిమా చేయ‌బోతున్నారట. ఈ సినిమా కోసం ‘వ‌డ చెన్నై’ నిర్మాత ధ‌నుష్ నుండి రైట్స్ కూడా తీసుకున్నారట.

ఇక శింబు పాత్ర కచ్చితం ధ‌నుష్ లాగే బ‌క్క‌గా క‌నిపించాల్సిన అవసరం ఉందట. అందుకే శింబు మ‌రింత బ‌రువు త‌గ్గి ఉంటాడు అని చెబుతున్నారు. అన్నట్లు ఈ సినిమాలో జైల‌ర్ ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ ఒక చిన్న పాత్రలో కనిపించనున్నారట. త్వ‌ర‌లోనే సెట్స్పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాని వ‌చ్చే ఏడాది వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. ఇదంతా ఓకే కానీ పది రోజుల్లో 10 కిలోల బరువు ఎలా తగ్గాడో మరి.

కన్నీళ్లు.. వంటలు.. ఆర్ట్‌లు.. ప్రీతి ముకుందన్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus