ప్రముఖ నటుడిపై సంచలన ఆరోపణలు చేసిన భార్య!

ప్రముఖ బాలీవుడ్ నడుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై అతని భార్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.. ‘అతడు నన్ను రేప్ చేశాడు.. ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అంటూ ఓ వీడియో విడుదల చేశారామె.. స్టార్‌ యాక్టర్‌ నవాజుద్దీన్‌ సిద్ధిఖీ పేరు గత కొద్ది రోజులుగా మీడియాలో మారు మోగిపోతోంది.. నవాజుద్దీన్, ఆలియా 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. 2020లో నవాజుద్దీన్‌ – ఆలియా విడిపోయారు. తర్వాత మనుసు మార్చుకుని తిరిగి భర్తతో కలసి ఉంటున్నారు.

అయితే కొద్ది కాలంగా ఆలియాకి, నవాజుద్దీన్ తల్లి మొహ్రూనిసాకి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ఆలియా మీద మొహ్రూనిసా కేసు పెట్టారు. ఆలియా, తనకు కనీసం అన్నం కూడా పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. తనను వంటగదిలోకి రానివ్వడం లేదని, ఆఖరికి ఆన్‌‌లైన్ ఫుడ్ డెలివరీ చేసేవాళ్లను కూడా రాకుండా చేస్తున్నారని ఆలియా ఆరోపించారు.. తనను బెడ్‌ రూమ్‌లో కూడా నిద్రపోనివ్వడం లేదని..

హాల్‌లో సోఫాలోనే నిద్రపోవాల్సి వస్తోందని ఆలియా ఆరోపించారు. పోలీసులను కలవకుండా చేస్తున్నారని.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన లాయర్‌ ద్వారా విషయం బయటకు చెప్పాల్సి వచ్చిందని ఆమె వాపోయారు. నవాజుద్దీన్‌ భార్యగా తనకు ఇంట్లో ఉండే హక్కు లేదా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారామె.. ఆలియా ఇంట్లో ఉండేందుకు వీలులేదని నవాజుద్దీన్ తల్లి గొడవ చేస్తున్నారని తెలుస్తోంది.. ఇదిలా ఉంటూ.. తాజాగా మరోసారి తన బాధను ఓ వీడియో ద్వారా మీడియా మరియు ప్రేక్షకులతో పంచుకున్నారు ఆలియా..

భర్త తనను బలవంతం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.. తన బాధను, పిల్లల భవిష్యత్తు గురించిన బాధను ఈ వీడియోలో వివరించారు ఆలియా.. ‘‘అతడు నన్ను రేప్ చేశాడు.. ఆధారాలతో వెర్సోవా పోలీసు స్టేషన్‌లో‌ ఫిర్యాదు చేశా.. నా పిల్లలు అక్రమ సంతానం అని నవాజుద్దీన్ తల్లి ఆరోపిస్తే.. ఆయన ఏమీ మాట్లాడడం లేదు.. ఇలాంటి మనసు లేని మనిషుల చేతుల్లోకి నా పిల్లలను వెళ్లనివ్వను’’ అని చెప్పుకొచ్చారు ఆలియా..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus