‘బిగ్ బాస్5’ : చిరుతో పాటు ఆ స్టార్ హీరోని కూడా పిలిచారట..!

‘బిగ్ బాస్5’ గ్రాండ్ ఫినాలేని నిన్న గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. అన్ని సీజన్ల కంటే ఎక్కువగా ఈసారి స్టార్ల సందడి ఎక్కువగానే జరిగింది. ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సినిమా ప్రమోషన్ల కోసం నాని వంటి హీరోతో పాటు బాహుబలి నిర్మాతలైన ఆర్కా మీడియా వారు కూడా తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి రాజమౌళిని వెంటేసుకుని మరీ వచ్చారు. పనిలో పనిగా తన ‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్ ను కూడా జరిపేసాడు నాగార్జున.

అయితే గత రెండు సీజన్లకి గెస్ట్ గా హాజరైన చిరంజీవి ఈసారి హాజరుకాలేదు. దీంతో రాకరాకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరు- నాగ్ ల సన్నిహిత్యం గురించి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఎక్కువ షోలకి హాజరైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఈసారి కూడా చిరంజీవిని నాగార్జున ఫినాలే కోసం ప్రత్యేకంగా ఆహ్వానించారట. అయితే చిరు.. నాగ్ రిక్వెస్ట్ ను సున్నితంగా తిరస్కరించారట. అందుకు కారణం చిరు వరుస సినిమాలతో బిజీగా ఉండడమే అని తెలుస్తుంది.

అంతేకాకుండా ఈ టైములో చిరు ఏదైనా ఈవెంట్ కు వస్తే ఏపిలో నెలకొన్న టికెట్ రేట్ల ఇష్యు గురించి మాట్లాడాల్సి వస్తోంది. పరోక్షంగా ఏపి ప్రభుత్వం సినీ పరిశ్రమ పై కక్ష్య సాధింపు చర్యలు చేపడుతుంది. అది పవన్ పై ఉన్న రాజకీయ తగాదాల కారణంగానో లేక సినీ పరిశ్రమ ఇంకా ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వలేదనో తెలీదు.. అక్కడి ప్రభుత్వం అయితే అలాగే ప్రవర్తిస్తుంది. ఇది పక్కన పెడితే..

‘బిగ్ బాస్5’ ఫినాలేకి వెంకటేష్ ను కూడా గెస్ట్ గా ఆహ్వానించారట. సీజన్2 ఫినాలేకి కూడా అతను హాజరవ్వడం జరిగింది. అయితే ఈసారి ఎందుకో ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus