స్టార్‌ హీరో డైరక్షన్‌లో మరో స్టార్‌ హీరో… ఊహించని కాంబినేషన్‌ ఇది!

స్టార్‌ హీరో దర్శకత్వంలో మరో స్టార్‌ హీరోగా నటించడం అంటే చాలా పెద్ద విషయం. అందులో ఆ ఇద్దరి కెరీర్‌ నడుస్తుండటం ఇంకా పెద్ద విషయం. మలయాళంలో ఇలాంటి పరిస్థితి మోహన్‌లాల్‌ (Mohanlal) – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) దగ్గర చూశాం. అయితే అందులో ఒకరు సీనియర్‌ స్టార్‌ హీరో, మరొకరు యంగ్‌ స్టార్‌ హీరో. కానీ ఇద్దరు సీనియర్‌ స్టార్లు కలసి ఓ సినిమాకు సిద్ధమవుతున్నారంటే అది బాలీవుడ్‌లోనే. అవును, సరైన విజయం కోసం ప్రతి నెలా వెయిట్‌ చేస్తున్న బాలీవుడ్‌లో ఓ క్రేజీ కాంబినేషన్‌ సిద్ధమవుతోంది.

Ajay Devgn, Akshay Kumar

‘యు మే ఔర్‌ హమ్‌’, ‘శివాయ్‌’, ‘రన్‌వే 34’ (Runway 34), ‘భోళా’ (Bhoola) సినిమాలతో దర్శకుడిగా నిరూపించుకున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) తన కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమాలో మరో స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ను (Akshay Kumar), హీరోగా తీసుకుంటున్నారు అని ఇన్నాళ్లూ టాక్‌ నడిచింది. తాజాగా ఈ విషయాన్ని అజయ్‌ దేవగణ్‌ అధికారికంగా ప్రకటించాడు. నేను, అక్షయ్‌ కుమార్‌ ఓ సినిమా కోసం చాలా రోజులుగా పని చేస్తున్నాం. ఆసక్తికరంగా సిద్ధమవ్వనున్న ఈ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది. అందుకే ఇప్పుడే పూర్తిగా వివరాలు చెప్పాలనుకోవట్లేదు. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాల్ని వెల్లడిస్తా అని చెప్పాడు. ఇక అక్షయ్‌ కుమార్‌ సినిమాలు చూస్తే.. చాలా సినిమాలు లైనప్‌లో పెట్టుకుని ఉన్నాడు. దీంతో అజయ్‌ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే ప్రశ్న మొదలైంది. ‘స్కై ఫోర్స్‌’, ‘శంకర’, ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’, ‘హౌస్‌ ఫుల్‌ 5’, ‘కన్నప్ప’(Kannappa) , ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’, ‘హెరా ఫెరీ 3’, ‘వేదత్‌ మరాఠే వీర్‌ డౌడ్లీ సాత్’ సినిమాలు చేస్తున్నాడు.

ఇవి 2026 వరకు వెళ్లేలా ఉన్నాయి.ఇక అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) సినిమాలు చూస్తే.. ‘ఆజాద్‌’, ‘రైడ్‌ ’, ‘దే దే ప్యార్‌ దే 2’, ‘సన్ ఆఫ్‌ సర్దార్‌ 2’ ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాదిలో అయిపోతాయి. కాబట్టి 2026లో అక్షయ్‌ – అజయ్‌ సినిమా ఉండొచ్చు. అన్నట్లు ఇలాంటి కాంబినేషన్‌ మన దగ్గర కూడా కుదిరితే బాగుండు కదా. ఎవరు ఆ ఆలోచన చేస్తారో చూడాలి.

నానా మాటలు అన్నారు.. ఇప్పుడు తెగ మెచ్చుకుంటున్నారు.. ఇదేగా జీవితమంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus