మలయాళ సినిమా పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు తీసుకొచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఏ మాత్రం బాలేదని, సినిమా షూటింగ్‌లు విషయంలో ఇంకా చెప్పాలంటే సినిమాల విషయంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో అప్పటి నుండి పెద్ద ఎత్తున పరిశ్రమలోని వ్యక్తుల మీద నటీమణులు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా నటి పద్మప్రియ (Padmapriya) కూడా తనకు గతంలో ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.
Star Actress
మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదికపై ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పద్మప్రియ చెప్పుకొచ్చారు. అయితే అది తనకు కోలీవుడ్ ఎదురైంది అని చెప్పారు. ఓ తమిళ సినిమా సెట్‌లో దర్శకుడు తనను పబ్లిక్‌గా చెంపదెబ్బ కొట్టాడని పద్మప్రియ (Star Actress) ఆరోపించింది. అయితే ఆ సమయంలో మీడియా తానే దర్శకుడిని కొట్టినట్లు తప్పుగా రాసిందని ఆమె చెప్పారు.
తాను దర్శకుడిని కొట్టినట్లు మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవం అని చెప్పిన ఆమె.. ఆ సమయంలో తన వాదనను ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. మహిళలలు తమకు ఎదురైన అనుభవాలను చెబితే వాటిని కొట్టిపారేయడమో, లేక వారినే తప్పుగా చూపించడం లాంటివి చేస్తున్నారని ఆమె బాధపడింది. ఈ పరిస్థితికి తనకు జరిగిన పరిస్థితే ఓ ఉదాహరణ అని చెప్పింది. అంతేకాదు ఆ తర్వాత తమిళ చిత్రాలను నిరాకరించాను అని కూడా పద్మప్రియ (చెప్పింది.
ఇంత చెప్పిన పద్మప్రియ (Star Actress) ఆ దర్శకుడు ఎవరనే విషయాన్ని చెప్పలేదు. అయితే ఆయన ఆరు నెలల పాటు సినిమాలు చేయకుండా పరిశ్రమ నిషేధించింది అని చెప్పారు. దీంతో ఆయనను ఎవరూ ఏమీ అనలేదు, అంతా తననే అన్నారు అని చెబుతున్న ఆమె మాటల విషయంలో వేరే స్పందనలు కూడా వస్తున్నాయి. ఆయన మీద ఆరు నెలల నిషేధం విధించారు కదా అని అంటున్నారు. అయితే మరి ఆమె ఉద్దేశం ఏంటో తెలియాల్సి ఉంఇ.
ఇక పద్మప్రియ మనకు బాగా తెలిసిన నటే. ఆర్పీ పట్నాయిక్ (R. P. Patnaik) ప్రధాన పాత్రలో నటించిన ‘శీను వాసంతి లక్ష్మి’ సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘అందరి బంధువయ’ (Andari Bandhuvaya) , ‘పటేల్’ తదితర చిత్రాల్లో నటించారు. ఇక్కడ సరైన స్పందన లేకపోవడంతో మలయాళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు.