సరోగసి ద్వారా తల్లైన సీనియర్ స్టార్ హీరోయిన్…ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

మణిరత్నం దర్శకత్వంలో తెరెక్కిన ‘దిల్ సే’ మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రీతీ జింటా. అయితే ఆమె క్రేజీ హీరోయిన్ గా మారింది మాత్రం మన తెలుగు సినిమాతోనే..! వెంకటేష్ హీరోగా జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమంటే ఇదేరా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.తర్వాత మహేష్ బాబు డెబ్యూ మూవీ ‘రాజకుమారుడు’ లో కూడా హీరోయిన్ గా నటించి మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.

అయితే ఎందుకో ఈమె మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు. వరుసగా హిందీలోనే సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బిజినెస్ రంగంలో కూడా తన హవా చూపిస్తూ తొలి మహిళా ఐపీఎల్ జట్టుకి ఓనర్‌గా సంచలనం సృష్టించింది. తర్వాత అమెరికాకు చెందిన బిజినెస్‌మెన్ జీన్ గుడ్‌ఎనఫ్‌తో ప్రేమలో పడి 2016 సంవత్సరంలో ఆయన్ను సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుంది. వివాహం అనంతరం అమెరికాలోనే సెటిల్ అయిన ఈమె ఇటీవల సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది.

‘అందరికీ నమస్కారం… మా జీవితాల్లో ఈరోజు చాలా ప్రత్యేకమైంది.ఇంత గొప్ప ఆనందకరమైన వార్తను మీతో పంచుకోవాలని తహతహలాడుతున్నాను. జీన్‌, నేను కవలలకు జన్మనిచ్చాం. సరోగసి ద్వారా కవలలను ( జై జింటా, గియా జింటా) మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. మా లైఫ్ జర్నీలో భాగమై సహకరించిన డాక్టర్లకు,అలాగే ఇతర వైద్య సిబ్బందికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అంటూ ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది ప్రీతీ.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus