పిచ్చెక్కించే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కాజల్ అగర్వాల్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఈమె ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘లక్ష్మీ కళ్యాణం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా కాజల్ అగర్వాల్ కి అవకాశాల వెల్లువ కురుస్తూనే ఉంది. అలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన కాజల్ అగర్వాల్ కి మొట్టమొదటి హిట్ గా ‘చందమామ’ చిత్రం నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ‘మగధీర’ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని తుడిచి పారేసింది.
అయితే మగధీర సినిమా తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చిరంజీవి , బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , ప్రభాస్, రవితేజ ఇలా ప్రతీ టాప్ హీరో సరసన నటించి అనతి కాలం లోనే సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. అయితే కాజల్ అగర్వాల్ కి ఈ స్థానం అంత తేలికగా రాలేదు, ఎంతో కష్టం డెడికేషన్ ఉండబట్టే ఈ రేంజ్ కి చేరుకుంది.
ఆమె డెడికేషన్ గురించి ప్రముఖ నిర్మాత శోభారాణి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ కాజల్ తో నేను ఎంతవరకు ఈ ప్రేమ అనే చిత్రం చేశాను. అందులో జీవా హీరో గా నటించాడు, ఆ సినిమా ప్రొమోషన్స్ సమయం లో కాజల్ నాలుగైదు సినిమాలకు డేట్స్ ఉన్నాయి. ఆమె ప్రొమోషన్స్ కి రాలేని పరిస్థితి, అయినా కూడా ఓపిక చేసుకొని నిర్మాత బాగుకోసం వచ్చింది.
ఆమెకు (Actress) కనీసం ఈవెంట్ వచ్చే ముందు బట్టలు మార్చుకునే సమయం కూడా లేదు, దీంతో కార్ లోనే ఆమె బట్టలు మార్చుకొని ఈవెంట్ కి వచ్చింది అంటూ శోభారాణి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆరోజుల్లో కాజల్ అగర్వాల్ బట్టలు మార్చుకుంటూ కెమెరాలకు కూడా దొరికిపోయింది అంటూ వార్తలు కూడా వినిపించాయి, అది ఈ సినిమా కోసమేనట.