సినీ పరిశ్రమలో ఎదగాలి అంటే ‘కష్టానికి కొలతలు వేసుకోకూడదు. త్యాగానికి హద్దులు పెట్టుకోకూడదు’ అని కొంతమంది చెబుతుంటారు. నిజమే.. అయితే ఇది బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లకి మాత్రమే. బ్యాక్ గ్రౌండ్ కనుక ఉంటే ఏదో ఒక ప్రాజెక్ట్ లో అవకాశం వస్తుంది అది కూడా తాపీగా చేసుకోవచ్చు అని ఇండస్ట్రీ జనాలు చెబుతూ ఉంటారు. ఇది కూడా నిజమే. సినిమాల్లో నటించే వాళ్ల కైనా, సీరియల్స్ లో నటించే వాళ్ళకైనా.. ఇదే వర్తిస్తుంది.
ఇదిలా ఉండగా.. ఓ సీరియల్ నటి (Actress) తాజాగా తాను పడిన కష్టాలను వివరించింది. ఈమె మరెవరో కాదు జుహీ పర్మార్. కుంకుమ అనే సీరియల్ తో పాపులర్ అయిన ఈ బ్యూటీ.. ఆ సీరియల్ కోసం ఏకంగా 30 గంటల పాటు నాన్ స్టాప్ గా పనిచేసిందట. 2002 లో ప్రారంభమైన ఈ సీరియల్ 2009 వరకు టెలికాస్ట్ అవుతూనే వచ్చింది. ఈ సీరియల్ కోసమా జుహీ పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేసిందట.
సాధారణంగా ఇప్పటి సినిమాలు, సీరియల్స్ షూటింగ్ టైంలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఉంటాయి. కానీ 20 ఏళ్ళకి ముందు ఉదయం 8 గంటలకే సెట్ లో ఉండాలనే కండిషన్ పెట్టారట. దీంతో జుహీ వాళ్లకి పేరు కోసం వాళ్లకి సరెండర్ అయిపోయిందట. ఆమెకు ఈ సీరియల్ మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెబుతూ.. ఈ విషయాలను ఆమె చెప్పుకొచ్చింది.