అపార్ట్మెంట్ పై నుండీ దూకి నటి ఆత్మహత్య.. !

‘ప్రేమకథా చిత్రం’ సినిమాలో డైరెక్టర్ మారుతీ చెప్పినట్టు… కారణాలు చిన్నవైనా ఆత్మహత్యలు చేసుకోవడం ఈమధ్య బాగా ఎక్కువయ్యాయి. స్కూల్లో టీచర్ అందరి ముందు తిట్టి అవమానించిందని కొంత మంది అమ్మాయిలు, తండ్రి తిట్టాడని కొంతమంది అబ్బాయిలు, లవర్ హ్యాండిచ్చిందని కొందరు, ఉద్యోగం రాలేదని కొందరు, మంచి ర్యాంక్ రాలేదని కొందరు… భర్త వేధిస్తున్నాడని కొందరు, పెళ్ళాం టార్చర్ ఎక్కువైందని కొందరు… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. కేవలం సాధారణ ప్రజలే కాదు సెలెబ్రిటీలు కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కెరీర్ ప్రారంభంలో అవకాశాలు రావట్లేదని నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని.. స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఇక హీరో ఉదయ్ కిరణ్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే.. అయితే అంతకు ముందే ఆయన ఓసారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారని డైరెక్టర్ తేజ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ నటి ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఓ పంజాబీ నటి ‘పెరల్’ ఆత్మహత్యకు పాల్పడటం పెద్ద సంచలనమయ్యింది. ఆమె నివసిస్తున్న అపార్ట్మెంట్ పై నుండీ దూకి ప్రాణాలు తీసుకుంది. అనేక సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రావడంలేదని డిప్రెషన్ కు వెళ్లిపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. ముంబైలోని ఓషివారా అపార్ట్మెంట్ లో ‘పెరల్’ మూడో ఫ్లోర్ లో తన తల్లితో కలిసి నివసిస్తుంది. ఆమె కొంత కాలం నుండీ తరచుగా తల్లితో గొడవ పడుతుండేదట. ఆఫర్లు రావడం లేదు… సరైన గుర్తింపు రావడం లేదంటూ గతంలో రెండుసార్లు ఇలానే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందట, అదృష్టవశాత్తు రెండుసార్లు గాయాలతో బయటపడ్డ పెరల్.. అర్ధరాత్రి సమయంలో సడెన్ గా అపార్ట్మెంట్ పై నుండీ దూకి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు పై విచారణ చేపట్టారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus