ఆ ఒక్క ఫోటోతో తన రిలేషన్ పై క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్.!

రాంచరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎవడు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్ ఆ తర్వాత ‘ఐ’ ‘నవ మన్మధుడు’ ‘రోబో’ ‘2.0’ చిత్రాలతో ప్రేక్షకులకి మరింతగా దగ్గరైంది. కాకపోతే ఆ సినిమాల తర్వాత సడన్ గా ఈమె మాయమైపోయింది. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న టైంలోనే ప్రముఖ బిజినెస్మెన్ జార్జ్‌ పనియోటౌతో ప్రేమలో పడి ఆ తర్వాత సహజీవనం చేసి పెళ్లి కాకుండా ఆండ్రూ అనే పిల్లాడికి జన్మనిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

ఈమె గర్భం దాల్చినప్పుడు కూడా గ్లామర్ ఫోటోలను షేర్ చేసేది. ఇక ఆండ్రూ పుట్టిన తర్వాత.. అమీ- జార్జ్ లు పెళ్లి చేసుకుంటామని వెల్లడించారు. కానీ ఇప్పటివరకు వాళ్ళు పెళ్లి చేసుకుంది లేదు. అటు తర్వాత వీళ్లిద్దరికీ బ్రేకప్ అయినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత అమీ జాక్సన్‌ మరో బ్రిటీష్‌ నటుడు ఎడ్‌‌వెస్ట్విక్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తల పై ఆమె ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు.

లండన్లో అతనితో విచ్చల విడిగా తిరిగిన ఫోటోలు అనేకం నెట్టింట్లో సందడి చేశాయి. కానీ ఇది నిజమో కాదో ఆమె ధృవీకరించలేదు. అయితే తాజాగా ఆమె ఎడ్వెస్ట్విక్తో చాలా క్లోజ్ గా తీసుకున్న ఇంకా చెప్పాలంటే రొమాంటిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూస్తుంటే కచ్చితంగా వారు ప్రేమలో ఉన్నారని చాటి చెబుతున్నట్టు ఉంది. అమీ జాక్సన్ కావాలనే.. పరోక్షంగా ఈ విషయం పై స్పందించింది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus