తన వ్యాధి గురించి బయటపెట్టిన నటి..!

ప్రముఖ బుల్లితెర నటి ఐశ్వర్య సఖుజ తనని పీడిస్తున్న వ్యాధి గురించి చెప్పి అందరికీ షాకిచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “2014లో నా లైఫ్ లో జరిగిన సంగతి ఇది. నేను ఆ టైములో ఓసారి షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నా. మధ్యాహ్నం రెండు గంటల షిఫ్ట్‌ కోసం వెళ్తున్నాను అనుకుంట. అప్పుడు నా భర్త రోహిత్ ఎందుకు కన్ను కొడుతున్నావని అడిగాడు.తను నాతో ఏదో జోక్ చేస్తున్నాడు అనుకున్నాను.

తర్వాత రోజు ఉదయం బ్రష్ చేసుకున్నప్పుడు విపరీతమైన నొప్పి వచ్చింది.అటు తర్వాత నా రూమ్‌మేట్‌ నా మొహం మారిపోయింది ఏంటి అని నాతో చెప్పింది.దాంతో నేను వెళ్లి డాక్టర్‌ను కలిశాను. అప్పుడే నాకు రామ్‌సే హంట్‌ అనే వ్యాధి ఉన్నట్లు భయటపడింది. కానీ నేను కొన్ని ప్రాజెక్టులకు కమిట్ అవ్వడం తో విశ్రాంతి తీసుకోవాలి అనుకోలేదు. నా మొహం కవర్ చేసుకుంటూ షూటింగ్స్‌లో పాల్గొనేదాన్ని. దాంతో నాకు స్టెరాయిడ్స్‌ ఇచ్చి మరీ వైద్యం చేశారు.

నటిగా అందంగా కనిపించడం అనేది చాలా ముఖ్యం. తిరిగి నార్మల్‌ అవుతానో లేదో అని ఆ టైములో చాలా భయపడ్డాను. కానీ నెల రోజుల్లోనే ఆ వ్యాధి నుండి కోలుకున్నాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఐశ్వర్య సఖుజ ‘ఉజ్దా చమాన్‌’ సినిమాలో ఏక్త పాత్రలో కనిపించింది.అలాగే ‘సాస్‌ బీనా ససురాల్‌’, ‘ఆషికి’, ‘త్రిదేవియాన్‌’, ‘యే హై చహతే’ వంటి సీరియల్స్‌ లో కూడా చేసింది.

నిజానికి ఇలాంటి వ్యాధి ఉందని చెప్పుకోడానికి నటీమణులు భయపడతారు. చాలా ఇబ్బంది పడినా దీనిని బయటకు చెప్పుకోడానికి ఇష్టపడరు. అయినప్పటికీ ఐశ్వర్య సఖుజ రివీల్ చేయడం గమనార్హం. అలాగే ఈ మధ్యనే స్టార్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ కూడా తాను రామ్‌సే హంట్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus