అలాంటి వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్!

‘దంగల్’ లో ఆమిర్ ఖాన్ కూతురుగా కనిపించిన ఫాతిమా సనా షేక్ ను అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సినిమా తర్వాత ఈమె బాగా పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె ఫాలోయింగ్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వడం ఖాయం. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి ఏకంగా 3.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కువగా ఈమె గ్లామర్ ఫోటోలను షేర్ చేసి యువతని ఆకర్షిస్తూ ఉంటుంది. మొన్నామధ్య ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 3 ఏళ్ల వయసుకే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి

అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఉద్యోగం కోసం క్వాలిఫికేషన్ ఎలానో హీరోయిన్ కావాలంటే కమిట్మెంట్ అలా’ అంటూ చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ఓ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపి మరోసారి వార్తల్లో నిలిచింది. ఫాతిమా సనా షేక్ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.’నేను చాలా కాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాను. మెడికేషన్‌ సహాయంతో ఇప్పుడు నా పరిస్థితి అదుపులో ఉంది’ అంటూ ఆమె తెలిపింది.

నేషనల్‌ ఎపిలెప్సీ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్ నెలలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌స్టోరీ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఫాతిమా సనా తన ఆరోగ్య పరిస్థితిని వివరించింది. మందులు, వ్యాయామం ద్వారా ఈ వ్యాధిని ఎదుర్కొంటున్నానని అలాగే తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కూడా ధైర్యం చెప్పడం వల్ల తనకు ఆ వ్యాధి ఉన్న ఆలోచనే రాదని ఆమె తెలిపింది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus