‘‘ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం, కోపం రాకుండా ఉంటుందా?.. వచ్చినప్పుడు చూపించెయ్యడమే.. ఈ విషయంలో మా ఫుల్ సపోర్ట్ నీకే’’ అంటూ నటి గౌహార్ ఖాన్‌కి సోపోర్ట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.. అసలు ఇంతకీ ఎవరీ గౌహార్ ఖాన్?.. అసలామె ఎందుకు, ఏ హీరోని తిట్టింది?.. అనే వివరాలు తెలుసుకోవాలంటే.. మాత్రం తెలియని వాళ్ల కోసం తన గురించి స్మాల్ ఇంట్రడక్షన్.. గౌహార్ ఖాన్.. పాపులర్ బాలీవుడ్ మోడల్ కమ్ యాక్ట్రెస్.. బిగ్ బాస్ సీజన్ 7లో పార్టిసిపెట్ చేసింది..
తోటి కంటెస్టెంట్ కుషాల్ టాండన్‌తో కొన్నాళ్లపాటు రిలేషన్ షిప్‌లో ఉంది.. తర్వాత బ్రేకప్ చెప్పేసి.. 2020 డిసెంబర్ 25న మరో వ్యక్తిని పెళ్లాడింది.. సినిమాలు, టీవీ అండ్ వెబ్ సిరీస్‌లతో పాటు పలు బిగ్ బాస్ పలు సీజన్లలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది కూడా.. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్‌లో బిగ్ బాస్ సీజన్ 16 సందడి స్టార్ట్ అయ్యింది. ఇటీవల గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గౌహార్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది..
ఇక విషయానికొస్తే.. సాధారణంగా టాస్క్ అప్పుడు పోటీ కారణంగా కంటెస్టంట్స్ సహనం కోల్పోయి ఫ్లో లో నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు.. అలాగే ఇంటి సభ్యుడు షాలిన్ భానోత్ ఒక టాస్క్ సందర్భంగా తన తోటి కంటెస్టంట్ గౌతమ్ విగ్ గురించి ‘ఔరత్.. కమ్ జోర్’ అనే పదాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు ఇది బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయింది. మహిళలు చేతకాని వాళ్లు అనే అర్థం వచ్చేలా మాట్లాడిన షాలిన్ మీద తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
తాాజాగా గౌహార్ ఖాన్ కూడా అతడిపై ఫైర్ అయింది.‘‘షాలిన్ భానోత్ మహిళలు ఏమీ బలహీనమైన వారు కాదు.. తోటి కంటెస్టంట్ గౌతమ్‌ని ఆడవారిగా పోల్చి మాట్లాడటం అవమానకరంగా ఉంది.. నీ ప్రవర్తన అందరూ తలదించుకునేలా ఉంది.. ఒకవేళ మీరు అవమానించాలని అనుకుంటే అతన్ని వేరే విధంగా కామెంట్స్ చేయండి.. కానీ స్త్రీ బలాలు.. బలహీనతల గురించి మాట్లాడొద్దు.. మీ అమ్మ కూడా ఒక స్త్రీ అనే విషయం మర్చిపోవొద్దు’’ అంటూ ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ లాంటి వార్నింగ్ ఇచ్చింది.. గౌహార్ ఖాన్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది..
Shalin Bhanot auratein kamzor nahi hotin .To think calling Gautam an aurat is something derogatory, is extremely disappointing. Insult karna hai toh traits aur personality pe karo .Aurat kitni strong hoti hai woh toh aapke paidaish pe hi app ko pata hona chahiye.Ur mom is a woman