సినీ పరిశ్రమ అన్నాక.. ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఇలాంటివన్నీ చాలా కామన్ అయిపోయాయి. ఒకప్పుడు ఇలాంటి వార్తలు జనాలకి వెంటనే తెలిసేవి కాదు. కొన్ని మ్యాగ్జైన్ల ద్వారానో లేక న్యూస్ పేపర్ల ద్వారానో తెలిసేవి. కానీ ఇప్పుడు చేతిలోనే ప్రపంచం ఉంది. అదే స్మార్ట్ ఫోన్. అందులోనూ సోషల్ మీడియా ఊపందుకుంది. కాబట్టి సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు వెంటనే తెలిసిపోవాలి అన్నట్టు జనాలు కూడా భావిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాల పై క్లారిటీ ఇస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.
ఇక అసలు విషయానికి వెళ్తే.. బాలీవుడ్ హీరోయిన్ (Star Actress) రుక్సర్ రెహ్మాన్ తన రెండో భర్త ఫరూఖ్ కబీర్‌తో కూడా విడిపోయినట్లు ప్రకటించింది.వీళ్ళ మధ్య మనస్పర్థలు వచ్చాయి. చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ విషయం పై రుక్సర్ స్పందిస్తూ.. “ఈ ఏడాది ఫిబ్రవరి నుండే విడివిడిగా ఉంటున్నాం. విడాకులకు అప్లై చేసి వాటి కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ తెలిపింది. ఇక రుక్సర్ రెహ్మాన్ 19 ఏళ్ల వయస్సులోనే ‘యాద్ రాఖేగీ దునియా’ అనే చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ‘ఇంతేహా ప్యార్ కి’.. రామ్ గోపాల్ వర్మ ‘డి’, ‘సర్కార్’, ‘పీకే’, ‘గాడ్ టుస్సి గ్రేట్ హో’, ’83 ‘, ‘ఖుదా హఫీజ్ 2 ‘ వంటి చిత్రాల్లో నటించింది. మొదట ఈమె అసద్ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరికి ఐషా అహ్మద్ అనే కూతురు కూడా ఉంది. అసద్‌తో విడాకుల తీసుకున్న కొంతకాలానికి ఫరూఖ్ కబీర్‌తో డేటింగ్ మొదలుపెట్టింది.. అరేళ్ల డేటింగ్ తర్వాత 2010లో అతన్ని పెళ్లి చేసుకుంది.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!