యశ్ (Yash) సినిమా కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ‘కేజీయఫ్’ (KGF2) సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఆయన ‘టాక్సిక్’ (Toxic) అనే సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ప్రకటన తర్వాత సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయమే తీసుకున్నారు. తీరా మొదలుపెట్టాక ఏదో సమస్య వచ్చిందని, సినిమా షూటింగ్ ఆపేశారని, ఇప్పటివరకు తీసిన రషెస్ అంటే వేస్ట్ అయ్యాయని వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ తప్పు అని టీమ్ చెప్పే ప్రయత్నం చేస్తోంది.
ఎందుకంటే సినిమా కొత్త షెడ్యూల్‌ను టీమ్ స్టార్ట్ చేసింది. కియారా అడ్వాణీ (Kiara Advani), నయనతార (Nayanthara), హ్యుమా ఖురేషి (Huma Qureshi), తారా సుతారియా (Tara Sutaria) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించి బెంగళూరులో నాలుగో షెడ్యూల్ ప్రారంభించుకున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌తో నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా సినిమా సెట్‌లోకి అడుగుపెట్టినట్లు శాండిల్‌వుడ్ సమాచారం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఉంటుంది అంటున్నారు.
ప్రస్తుతం ఆ సెట్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారట. త్వరలో వీరికి కియారా అడ్వాణీ వచ్చి చేరుతుంది అని అంటున్నారు. ఆమె వస్తే రీసెంట్ రూమర్‌పై మరో క్లారిటీ కూడా వచ్చేస్తుంటుంది. ఆమె నటన పట్ల దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas), యశ్ సంతృప్తిగా లేరని, ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకుంటారు అని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె మళ్లీ షూట్‌కి వస్తే అవన్నీ పుకార్లు అని తేలిపోతాయి.
‘టాక్సిక్’ సినిమా టీమ్‌కి నటి హ్యుమా ఖురేషి తన కొత్త పుస్తకం జెబా కాపీల్ని ఇచ్చిందని చెబుతున్నారు. దాని వల్లే నయనతార ఈ సినిమా సెట్‌లోకి వచ్చిందని తెలిసింది. ఆమె ఆ పుస్తకం కాపీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తద్వారా సెట్స్‌లో నయన్ కూడా ఉందని లెక్కలేస్తున్నారు శాండిల్ వుడ్ ప్రేక్షకులు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా పూర్తి పేరు ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’.