ఒకప్పటి నటీమణులు రీ ఎంట్రీ ఇవ్వడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. ఒకప్పుడు హీరోయిన్లుగా చేసినవాళ్ళో లేక సెకండ్ హీరోయిన్లుగా చేసిన వాళ్ళో రీ ఎంట్రీ ఇవ్వడం మనం విన్నాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటి రీ ఎంట్రీ వేరు. ఆమె జూనియర్ ఆర్టిస్ట్ కు ఎక్కువ.. మెయిన్ ఆర్టిస్ట్ లకు తక్కువ అన్నట్టు సినిమాల్లో ఉండేది. ఆమె మరెవరో కాదు లత. లత గురించి వికీపీడియా వంటి వాటిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు.
అంతలా ఈమెను ఓ మూలన పడేసేవారు సినిమాల్లో, పెద్దగా గుర్తుండిపోయే పాత్రలు ఎంత మాత్రం చేయని ఈమె చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. గతంలో కొన్ని సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ లో కూడా నటించి తన అందంతో ఓ ఊపు ఊపేసింది. 150 కి పైగా సినిమాల్లో లత నటించింది. అందులో ‘మా ఆయన సుందరయ్య’ ‘లక్ష్మీ నరసింహ’ ‘రా’ వంటి సినిమాల్లో లత చేసిన పాత్రలు కొంతవరకు జనాలకు గుర్తుండొచ్చు.
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘లక్ష్మీ నరసింహ’ సినిమాలో కారం ప్యాకెట్లు దొంగతనం చేస్తుండగా.. హీరోయిన్ ఆసిన్ కు దొరికిపోయే 5 నిమిషాల పాత్రలో లత కనిపిస్తుంది. అటు తర్వాత హీరోయిన్ మహేశ్వరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మై నేమ్ ఈజ్ మంగతాయారు’ అనే సీరియల్ లో కూడా నటించింది. అలాగే ఓ అడల్ట్ కంటెంట్ సీరియల్ లో కూడా లత నటుడు మహర్షికి భార్య పాత్రలో నటించింది.మొత్తంగా 10 సీరియల్స్ లో ఈమె నటించింది.
అవేవి కూడా ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టలేదు. త్వరలో ఈమె రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. రీ ఎంట్రీలో కచ్చితంగా జనాలతో చప్పట్లు కొట్టించుకునే పాత్రలే చేయాలని ఈమె భావిస్తుంది. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఈమె సినిమాలకు దూరమైందట. ఇప్పుడు మళ్ళీ తనకు ఇష్టమైన సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఈమె ఎంత వరకు రాణిస్తుంది అనేది చూడాలి.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?