Actress: పెళ్లి రూమర్స్ పై స్పందించిన నటుడు.. ఏమైందంటే..?

షమితా శెట్టి.. అందరికీ సుపరిచితమే. శిల్పా శెట్టి సోదరిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ‘పిలిస్తే పలుకుతా’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. దివంగత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా బాగానే ఆడింది, షమితా శెట్టి లుక్స్ కు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ సినిమా బాగానే ఆడింది కానీ కానీ తర్వాత ఆమెకు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తెలుగులో ఈమె (Actress) కనిపించింది అంటూ ఏమీ లేదు.

అయితే అనూహ్యంగా గతేడాది ఈమె తన భర్త రాకేశ్‌ బాపత్‌ తో విడిపోతున్నట్లుగా ప్రకటించి షాక్ ఇచ్చింది. మా దారులు వేరు అంటూ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే విడాకులకు దరఖాస్తు చేసుకుని ఏడాది కూడా కాకుండానే ఈమె మరో వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే.. షమితా శెట్టి బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా అలీ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా ఓ రెస్టారెంట్ కి వెళ్తే.. అక్కడ నా స్నేహితురాలు షమిత కలిశారు. ఆ టైంలో మేము కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను నా కార్ లో ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేయడం జరిగింది. మేము మంచి స్నేహితులం. ఇంతకు మించి మా మధ్య .. బయట ప్రచారం జరుగుతున్నట్టు ఏమీ లేదు ” అంటూ చెప్పుకొచ్చారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus