కిక్ బాక్సర్‌గా కెరీర్‌ను షురూ చేసి.. హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రితికా సింగ్. వెంకటేశ్ టైటిల్ రోల్లో నటించిన గురు చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో నటించి సూపర్ క్రేజ్ సంపాదించింది. చేసింది కొన్ని సినిమాలే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగానే సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ కిక్ బాక్సింగ్, వర్కవుట్స్ వీడియోలను షేర్ చేస్తుంటుందని తెలిసిందే. కిక్ బాక్సింగ్ ని పూర్తిగా వదిలేసింది.
అయితే ప్రారంభం లో ఈమెకి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ, ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాపులు రావడం తో ఈమెకు సౌత్ లో అవకాశాలు రావడం బాగా తగ్గిపోయింది. అవకాశాలు తగ్గుతున్న సమయం లో ఆమెకి సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించే ఛాన్స్ రావడం చిన్న విషయం కాదు. ఈ సినిమా హిట్ అయితే రితికా సింగ్ (Ritika Singh) రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుంది.
అయితే ఈమెకి షూటింగ్ స్పాట్ లో జరిగిన ఒక చిన్న ప్రమాదం వల్ల ఆమె చేతులకు గాయాలు అయ్యాయి. ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ లో పాల్గొన్న రితికా సింగ్, గాజు అడ్డం అదుపు తప్పి ఆమె చేతి మీద పడడం వల్ల చెయ్యి మొత్తం గాయాల పాలై రక్తపు మరకలతో నిండిపోయింది. రితికా కి అలా గాయాలు అవ్వడం తో మూవీ యూనిట్ ఆమెకి సెలవు ప్రకటించింది.
ఆమె లేని కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ రితికా సింగ్ ఇందులో ఎలాంటి పాత్ర పోషిస్తుంది?, ఫైట్ సన్నివేశాలు చేస్తుందంటే నెగటివ్ రోల్ లో కనిపించబోతుందా?, లేదా పోలీస్ పాత్ర చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం లో రానా దగ్గుపాటి, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండగా, మంజు వారియర్ మరో హీరోయిన్ గా నటిస్తుంది.