Chandramukhi: ఆ హీరోయిన్ చంద్రముఖి పాత్ర చేసి ఉంటే మాములుగా ఉండేది కాదు..!

  • August 2, 2023 / 07:35 PM IST

చంద్రముఖి సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ఈ హర్రర్ జోనర్ చిత్రాన్ని పి. వాసు తెరకెక్కించారు. ఈ సినిమాతో జ్యోతిక ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ పాత్ర జ్యోతిక తప్పితే మరెవరు చేయలేరన్నంత ఫర్మామెన్స్ కనబరిచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత జ్యోతికకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికీ ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయితే అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుంటోంది.

అంతలా ప్రేక్షకులను చంద్రముఖి (Chandramukhi) సినిమా మెప్పించింది. 2005లో విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. సినిమాలో పాటలు కూడా బంపర్ హిట్ గా నిలిచాయి. మళ్లీ ఇన్నాళ్లకు చంద్రముఖికి సీక్వెల్ రాబోతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 చేస్తున్నారు. దీనిలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే చంద్రముఖి చిత్రంలో ఆ పాత్ర కోసం మొదట అనుకున్నది జ్యోతిక కాదట.

డైరెక్టర్ వాసు ఆ పాత్ర కోసం మరో స్టార్ హీరోయిన్ ను సంప్రదిస్తే ఆమె బిజీగా ఉన్నానని తిరస్కరించిందట. తను మరెమరో కాదు జయం బ్యూటీ సదా… అప్పట్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సదా.. ఈ క్రమంలోనే డైరెక్టర్ వాసు ఆమెను చంద్రముఖి పాత్ర కోసం అడిగారట..

దీంతో చేయలేనని ఆమె రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం సదా సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ.. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది. చంద్రముఖి సినిమా చేసుంటే తన కెరీర్ మరోలా ఉండేదని అంటున్నారు విశ్లేషకులు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus