ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ తో తారలకు తిప్పలు

హీరో, హీరోయిన్లు బయటికి వస్తే ఆటోగ్రాఫ్ , ఫోటోగ్రాఫ్ కోసం అభిమానులు వారి చుట్టూ మూగుతారు. ఇది వారికి సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ తాకిడి ఎక్కువైతే భాదను కలిగిస్తాయి. ఈ ఘటనలలో హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. చుట్టూ బౌన్సర్లు, పోలీసులు ఉన్నా విపరీతమైన అభిమానంతో తారలను తాకేందుకు ప్రయత్నిస్తుంటారు. కొంతమంది ఆకతాయిలయితే ఎక్కడెక్కడో చేతులు వేసేస్తారు. రీసెంట్ ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయి. జరుగుతున్నాయి.

సమంతక్రేజీ బ్యూటీ సమంత గత నెల చెన్నై లో షాప్ ఓపెనింగ్ వెళ్తే ఫ్యాన్స్ మీద పడ్డారు. తోపులాటలో ఒకరు సమంతను నలిపేసారు.

కాజల్ అగర్వాల్తాజాగా కాజల్ అగర్వాల్ నెల్లూరులో మాల్ ఓపెనింగ్ కి వెళితే కారు నుంచి దిగి మాల్ దగ్గరకు పోవడానికి అష్టకష్టాలు పడింది.

అనుష్కదేవుడు సన్నిధిలో కూడా ఫ్యాన్స్ ఆగడాలు తగ్గడం లేదు. అనుష్క కొన్ని రోజుల క్రితం తిరుమలకు వెళ్తే.. అక్కడ ఆమె చుట్టూ అభిమానులు గుమి గూడారు. సందెట్లో సడేమియా లాగా ఒకడు స్వీటీని టచ్ చేసాడు. ఆమె ఆగ్రహంతో చెంప చెల్లు మనిపించింది.

హెబ్బా పటేల్కుమారి 21 ఎఫ్ బ్యూటీ హెబ్బా పటేల్ కి కాకినాడలో చేదు అనుభవం ఎదురయింది. కొంతమంది కుర్రోళ్ళు ఆమె మీద పడి ఎక్కడంటే అక్కడ చేతులు వేయడంతో హెబ్బా ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది.

హన్సికహన్సికకు ఇటువంటి ఘటన ఎదురయింది. కోయం బత్తూర్ లో హన్సిక షాప్ ఓపెనింగ్ కి వెళ్తే జనాల రష్ లో ఆమెను తడిమేసారంట. ఇలాంటి ఇబ్బందులతో హీరోయిన్లు చాలా మంది షాప్ ఓపెనింగ్స్ కి రావడానికి భయపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus