సాధారణంగా సినిమా సెలబ్రిటీల జీవితం ఎంతో లగ్జరీగా రాయల్ గా ఉంటుందని చాలా మంది భావిస్తారు. అయితే ఆ జీవితం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయని వారి జీవితంలో కూడా కన్నీటి గాథలు ఉంటాయని వారు చెబితే తప్ప చాలామందికి తెలియదు.ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలు కొనసాగుతున్న వారందరూ కూడా వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వెల్లడించారు.
ఈ క్రమంలోనే తాజాగా నటి షెఫాలీ జరివాలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 2002 లో మ్యూజిక్ వీడియో ‘కాంతా లగా’ తో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె ఈ ఒక్క వీడియో ఆల్బమ్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు.ఇలా ఈమెకు వచ్చిన గుర్తింపు ద్వారా సినిమా అవకాశాలు రావడమే కాకుండా హిందీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొని సందడి చేశారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే షెఫాలీ జరివాలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన చిన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి అనారోగ్య సమస్యల గురించి తెలియజేశారు. తాను తన 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మూర్చ వ్యాధితో బాధపడే దానిననీ తెలిపారు.ఈ వ్యాధి కారణంగా నేను హఠాత్తుగా పడిపోతే అందరూ తనని చాలా విచిత్రంగా చూసేవారని తెలిపారు. ఇలా ఈ వ్యాధి దాదాపు పది సంవత్సరాలపాటు నన్ను వెంటాడిందని, ఈ విధమైనటువంటి వ్యాధితో పోరాడటం అనేది ఒక చాలెంజ్ అని తెలియజేశారు.
ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్న తనకు (Actress) జనాలలోకి వెళ్లాలంటే చాలా భయం వేసేదని తెలియజేశారు. ఇలా తన జీవితంలో తాను ఎన్నో సవాలను ఎదుర్కొన్నానని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు.అయితే ప్రస్తుతం తన పరిస్థితులు బాగున్నాయని మెడిసిన్ వాడటం వల్ల తాను ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడ్డాను అంటూ షెఫాలీ జరివాలా తన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించారు.