అల్లు అర్జున్ సినిమా నుండీ ఆమె ఎందుకు తప్పుకున్నట్టు?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న చిత్రం ‘పుష్ప’. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో సాగే కథతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ , కన్నడ భాషల్లో కూడా తెరకెక్కిస్తున్నారు. ‘రంగస్థలం’ వంటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ తరువాత సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.అందులోనూ ఇది పాన్ ఇండియా చిత్రం కావడంతో క్రేజ్ మరింత పెరిగింది.

ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించనుంది. సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ఎంపికయ్యాడు. సుకుమార్ ప్రతీ సినిమాకి దేవి శ్రీ ప్రసాదే సంగీతం అందిస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ‘పుష్ప’ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఒకటి ఉంటుందట. మొదట ఈ పాటలో ఊర్వశి రౌతెలా డ్యాన్స్ చేస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. నిజానికి ఈమె ఫిక్స్ అని కూడా టాక్ నడిచింది. అయితే ఎందుకో ఆమె ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు తాజా సమాచారం. దాంతో ‘పుష్ప’ టీం పై అందరికీ సందేహాలు మొదలయ్యాయి.

అయితే ఈమె తెలుగులో సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో ‘బ్లాక్ రోజ్’ అనే చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో ఈమెది లీడ్ రోల్ అని తెలుస్తుంది. అందుకే ఐటెం సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వడం కంటే లీడ్ రోల్ లో ఎంట్రీ ఇస్తే ఈమెను రిసీవ్ చేసుకునే విధానం పాజిటివ్ గా ఉంటుందని భావించి ఆ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నట్టు సమాచారం.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus