ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తులు వరుసగా మరణిస్తున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. ఈ మధ్య కాలంలో కృష్ణంరాజు, మహేష్ తల్లి ఇందిర దేవి, అలాగే సూపర్ సూపర్ స్టార్ కృష్ణ, నటుడు డి. మురళీ కృష్ణ వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారి మరణించి వారం రోజులు కూడా పూర్తికాలేదు. ఇంకా ఆయన అభిమానులు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు ఆ విషాదం నుండీ ఇంకా కోలుకోలేదు.
ఇలాంటి సమయంలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాబీ నటి దల్జీత్ కౌర్ ఖంగురా గురువారం నాడు.. ఉదయం కన్నుమూశారు. కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఈమె కోలుకున్నట్టు కనిపించినా… మళ్లీ పరిస్తితి విషమించడంతో ఆమె మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు . ఈమె వయసు 69 ఏళ్లు. ఈమె 10కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో, 70 పంజాబీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
‘పుట్ జట్టన్ దే’, ‘కీ బాను దునియా దా’, ‘సర్పంచ్’ వంటి చిత్రాలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2001 లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె.. ఇటీవల తన భర్త హర్మిందర్ సింగ్ డియోల్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మానసికంగా డిస్టర్బ్ అయ్యి సినిమాలకు దూరమైంది. ఇక దల్జీత్ కౌర్ ఖంగురా ఆత్మకు శాంతి చేకూరాలని కొంతమంది సినీ సెలబ్రిటీలు కోరుకుంటూ ఆమె కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!