ఆ వీడియోతో కెరీర్ నాశనమైంది.. నటి ప్రియాంక ఆవేదన!

  • February 21, 2023 / 05:20 PM IST

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారిపై జనాల ఫోకస్ ఎక్కువైంది. సెలబ్రిటీలు అడుగు బయటపెట్టి.. తిరిగి వెళ్లే వరకు వేలాది కెమెరాలు వారి మీద ఫోకస్ అవుతుంటాయి. దీంతో ఏదైనా తేడా వస్తే.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంటారు. ఇదంతా ఒక ఎత్తయితే.. కొందరు నటీమణులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు బయటకొచ్చి వారి కెరీర్ ని ఇబ్బందుల్లో పడేసేలా చేస్తున్నాయి.

అలాంటి ఓ పరిస్థితిని భోజ్ పురి నటి ఎదుర్కొంటుంది. భోజ్ పురికి చెందిన ప్రియాంక పండిత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ.. అభిమానులను కవ్విస్తుంటుంది. సోషల్ మీడియాలో ఈమెకున్న ఫాలోయింగ్ ఎక్కువే. ఇదిలా ఉండగా.. ఆమెకి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో ఒకటి గతేడాది బయటకొచ్చింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రియాంక వీడియోతో పాటు పలువురు భోజ్ పురికి చెందిన నటీమణుల ప్రైవేట్ వీడియోలు బయటకు రావడం, అవి సంచలనంగా మారడం జరిగింది.

వీటికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరూ కూడా బయటకు వచ్చి.. ఈ వీడియోలను ఖండించింది లేదు. కానీ ప్రియాంక మాత్రం ఈ వీడియోలపై రియాక్ట్ అయింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని.. తనను దెబ్బ తీయడానికే ఇలా టార్గెట్ చేసి.. వీడియోలను బయటకు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. లీకైన వీడియోలో ఉన్నది తాను కాదని..

మార్ఫింగ్ చేసి తన పరువుని తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియోతో తన కెరీర్ నాశనమైందని.. ఆవేదన వ్యక్తం చేసింది. ప్రియాంక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది ప్రియాంక.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus