‘గీత గోవిందం’ కథ విని హీరోయిన్స్ పారిపోయారు : అల్లు అర్జున్

మగధీర, సరైనోడు, భలే భలే మగాడివోయ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో నటించే అవకాశం కోసం నటీనటులు ఎదురు చూస్తుంటారు. ఈ బ్యానర్లో అవకాశం వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టేనని చాలామంది నమ్మకం. కానీ తొలిసారి ఈ బ్యానర్లో సినిమా చేయడానికి హీరోయిన్స్ వెనకడుగు వేశారు. ఈ విషయాన్ని స్వయంగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూవీ గీత గోవిందం. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆడియో వేడుక వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ..” మామూలుగా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఫ్రెండ్స్‌గా ఉంటారు. వాళ్లు ఎప్పుడైనా మంచి పాత్ర వస్తే మాకు చెప్పు అంటుంటారు. అలా అడిగినవాళ్లందరికీ ఈ సినిమాలోని పాత్ర గురించి చెప్పా. కానీ వాళ్లెవరూ ఈ సినిమా చేయలేదు. రష్మిక చేసింది. ఆమెకి ఈ సినిమాతో మంచి పేరొస్తుంది” అని వెల్లడించారు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించడానికి కూడా వెనుకాడరంటే.. ఆ రోల్ ఎలా ఉందోనని అందరికి ఆసక్తికలిగింది. ఆ పాత్ర ఎలా డిజైన్ చేశారో తెలుసుకోవాలంటే వచ్చే నెల 15న వరకు ఆగాల్సిందే. అప్పుడే “బన్ని” వాసు నిర్మించిన ఈ మూవీ థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus