టాలీవుడ్‌కి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ (Venkatadri Express) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), ఆ సినిమాతోనే భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… రకుల్‌కు ఇది తొలి సినిమా కాదు. కన్నడ చిత్రమైన గిల్లీతోనే ఆమె వెండితెర ప్రయాణం మొదలైంది. అయితే ఆ టైంలో రకుల్‌కి సినిమా ఫీల్డ్ గురించి పెద్దగా అవగాహన లేకపోవడం విశేషం. మోడలింగ్ చేస్తూ ఉన్న సమయంలోనే ఆమెకు గిల్లీ నుంచి ఆఫర్ వచ్చిందని చెబుతోంది.
తాజా ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ, “ఆ సమయంలో సౌత్ సినిమాలు ఏమీ చూడలేదు. ఫోన్ వచ్చినప్పుడు కూడా ఎంతగానో ఆలోచించా. చివరికి నాన్నగారిని అడిగాకే ఓకే చెప్పా,” అని చెప్పింది. గిల్లీ సినిమా తరువాతే ఆమెకి యాక్టింగ్ పై ఆసక్తి పెరిగిందట. చదువు కొనసాగిస్తూనే సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్న రకుల్… అప్పటికే అవకాశాలు వస్తున్నా, తాను డేట్స్ ఇవ్వలేనని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్‌లో ఓ సినిమాకు 70 రోజుల డేట్స్ అడిగితే, తాను “కాలేజ్ ఉంది సర్..
కుదరదు. నాలుగు రోజులు మాత్రమే ఇస్తాను” అని చెప్పినట్టు చెప్పింది రకుల్. తన ప్రాధాన్యత చదువేనని అప్పుడు స్పష్టంగా తెలిపిందట. పూరీ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఆ ఛాన్స్ వదిలేశారట. అదే టైమ్‌లో మరెన్నో అవకాశాలు వచ్చినా చదువు కారణంగా రిక్జెక్ట్ చేసిందని చెప్పింది. ప్రేమ, బ్రేకప్ వంటి విషయాలపై కూడా రకుల్ తన అభిప్రాయాలు చెప్పింది. “లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ బ్రేకప్‌లు జరుగుతాయి. కానీ వాటి నుంచి నేర్చుకోవాలి.
ఎవరైనా వెళ్లిపోతే భయపడాల్సిన పని లేదు. ప్రేమ గొప్పది, కానీ మన లోటును ఎవరో నింపతారని తలుచుకోవద్దు,” అని చెప్పింది. అదే తన భర్త జాకీ భగ్నానీతో మొదట మాట్లాడిన విషయం అని, ఆలోచనలు కలవడంతో పెళ్లి జరిగిందని తెలిపింది. ప్రస్తుతం రకుల్ కెరీర్‌ను, వ్యక్తిగత జీవితం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. అగ్ర కథానాయికగా వెలుగొందిన ఆమె ఇప్పుడు వ్యక్తిత్వ పరంగా కూడా బలంగా నిలిచిందని ఈ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాల ద్వారా స్పష్టమవుతోంది.