‘స్టూడెంట్ నెంబర్ 1’ (Student No: 1) తో మొదటి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ (Jr NTR)… తర్వాత వి.వి.వినాయక్ ని (V. V. Vinayak) దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘ఆది’ (Aadi) అనే మాస్ మూవీ చేశాడు. బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) ఈ చిత్రాన్ని నిర్మించారు. 2002 మార్చి 28న పెద్దగా అంచనాలు లేకుండానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసింది. ఎన్టీఆర్ మొదటి సారి కంప్లీట్ మాస్ రోల్లో అదరగొట్టాడు.
వి.వి.వినాయక్ డైరెక్షన్ కి అప్పటి స్టార్ డైరెక్టర్లు అంతా వణికిపోయారు. 10 సినిమాల అనుభవం ఉన్న దర్శకుడిలా వి.వి.వినాయక్ ‘ఆది’ (Aadi) ని మలిచారు. ఈ సినిమా 108 కేంద్రాల్లో 50 రోజులు, 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 23 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ‘#23YearsOfAadi’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే :
నైజాం | 5.44 cr |
సీడెడ్ | 4.22 cr |
ఉత్తరాంధ్ర | 2.35 cr |
ఈస్ట్ | 1.57 cr |
వెస్ట్ | 1.06 cr |
గుంటూరు | 1.69 cr |
కృష్ణా | 1.58 cr |
నెల్లూరు | 1.01 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 18.92 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.90 cr |
వరల్డ్ వైడ్ (టోటల్ ) | 19.82 cr |
‘ఆది’ చిత్రం రూ.11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫైనల్ గా రూ.19.82 కోట్లు షేర్ ని కలెక్ట్ చేసింది. బయ్యర్స్ కు ఈ మూవీ రూ.8.82 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.