దయచేసి ఆపండి… నెటిజన్లకు ప్రముఖ నటి రిక్వెస్ట్‌!

‘‘నేను బతికే ఉన్నాను.. నేను చనిపోవాలని అనుకోలేదు’’ అంటూ ఓ మనిషి చెప్పుకుంటున్నారు అంటే… ఎంత దారుణం చెప్పండి. అలాంటి పరిస్థితే ఫేస్‌ చేస్తోంది ప్రముఖ మలయాళ నటి భామ. ఇటీవల ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో చాలామంది ఏమైందా అంటూ ఆరా తీస్తున్నారు. ఏమైందో తెలిసేలోపు ‘నేను ఆత్మహత్య చేసుకోలేదు బాబోయ్‌’ అంటూ భామ మాటలు బయటికొచ్చాయి. దీంతో ఇప్పుడు ఆమె మాటలు వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏమైందంటే…

2017లోని వేధింపుల కేసును తిరిగి విచారిస్తుండ‌టంతో భ‌యాందోళ‌న‌కు లోనై భామ ఇలాంటి చ‌ర్య‌కు పాల్పండిది అంటూ సోషల్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా వాటిపై భామ స్పందించింది. ‘‘నాపై వ‌స్తున్న పుకార్లు, క‌థనాల్లో ఎలాంటి నిజం లేదు. నా గురించి ఎవ‌రూ ఆందోళ‌న చెందొద్దు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు’’ అంటూ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. దీంతో ఆమె ఆత్మహత్యా యత్నం వార్తలు కాస్త సద్దుమణిగాయి.

లోహిత‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ‘నైవేద్యం’ అనే సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది భామ. ఆ త‌ర్వాత వివిధ ద‌క్షిణాది చిత్రాల్లోనూ న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. 2020 జ‌న‌వ‌రిలో దుబాయికి చెందిన వ్యాపార‌వేత్త అరుణ్‌ను పెళ్లి చేసుకుని సినిమాల‌కు బ్రేక్ చెప్పింది. ఆ మ‌రుస‌టి ఏడాదే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇటీవల ఆ కూతురి పుట్టిన రోజును ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసింది భామ అరుణ్‌.

సోషల్‌ మీడియాలో పుకార్ల వల్ల ఇబ్బందులు పడేవాళ్లు చాలామందే ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఏది నిజమో, ఏది కాదో తెలియక అన్నింటినీ నమ్మేసే పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమంలోనే భామ గురించి వచ్చిన పుకార్లను నెటిజన్లు నమ్మేస్తున్నారు. గతంలో జరిగిన విషయం నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు వచ్చేసరికి నిజమనేసుకున్నారు. అందుకే భామ కూడా ‘బాబోయ్‌ నేను బతికే ఉన్నా…’ అంటూ పోస్టు పెట్టింది. దయచేసి ఇకనైనా ఆ పోస్టులను నమ్మొద్దు అని కూడా రాసుకొచ్చింది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus