అభిమానుల దెబ్బకు స్కూటర్ ఎక్కి పారిపోయిన హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో..!

సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలనే కుతూహలం జనాలకు ఎక్కువగానే ఉంటుంది. ఎవరో ఒక సెలబ్రిటీతో ఫోటో దిగి.. దానిని వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుని బోలెడన్ని లైకులు, షేర్లు, కామెంట్లు రాబట్టుకోవాలి.. అలాగే ఆ ఫోటోని పదే పదే చూసి మురిసిపోవాలి.. అది ఒక ఖర్చు లేని ఆనందం జనాలకు.! అందుకే సెలబ్రిటీ కనుక ఎదురుగా కనిపిస్తే వెంటనే ఫోన్లు తీసుకుని వారి వద్దకు పరిగెడతారు. వాళ్ళను చుట్టు ముట్టేసి.. సెల్ఫీ ఇచ్చే వరకు వదిలిపెట్టరు.

ఇలాంటివి ఎదురైనప్పుడు సెలబ్రటీలు ఆనందపడుతూనే మరోపక్క టెన్షన్ కూడా పడుతుంటారు. ‘తమను గుర్తించే వారు ఇంత మంది ఉన్నారా?’ అనే ఆనందం ఒక వైపు, తమ వల్ల పబ్లిక్ లో న్యూసెన్స్ అవుతుంది, తొక్కిసలాట జరుగుతుంది, తమ టైం వేస్ట్ అవుతుంది అనే కారణాలతో టెన్షన్ మరో వైపు. ఇలాంటి టెన్షన్ తాజాగా ఓ హీరోయిన్ కు ఎదురైంది. తనను చూడగానే సెల్ఫీ అంటూ జనాలు ఎగబడ్డారు. ఆమె ఏమనుకుందో ఏమో కానీ వెంటనే అక్కడి నుండి పారిపోయింది ఆ హీరోయిన్.

వివరాల్లోకి వెళితే.. భోజ్ పురి హీరోయిన్ అక్షర సింగ్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బీహార్లోని బేథియాలో ఎలక్షన్ కాంపెయిన్లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమెను గుర్తు పట్టిన కొందరు జనాలు సెల్ఫీల కోసం పరుగులు తీస్తూ ఆమె వైపు వచ్చారు. వందల సంఖ్యలో జనాలు ఆమె వైపు ఫోటోల కోసం పరుగులు తీస్తూ రావడంతో ఆమె చెప్పులు కూడా వేసుకోకుండా తన సెక్యూరిటీతో ఉన్నపళంగా స్కూటర్ ఎక్కి పారిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus