ఆ సమస్య వల్లనే నిండుగా బట్టలు వేసుకోనంటున్న సీరియల్ నటి..!

సోషల్ మీడియాలో గ్లామర్ షో చేసే నటీమణులు చాలా మందే ఉన్నారు. అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో స్టార్ లుగా చాలామణి అవుతున్నారు కొంతమంది భామలు. ఆ లిస్ట్ లో ఉర్ఫీ జావేద్ కూడా ఒకరు. నటిగా రాణించాలి అని భావించిన ఈమె కాంట్రవర్సీలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. లక్నోలో పుట్టి పెరిగిన ఈమె .. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. అవకాశాల కోసం ముంబై వెళ్ళింది.

సినిమాల్లో అయితే ఈమెకు అవకాశాలు రాలేదు కానీ బుల్లితెర పై ఛాన్స్ లు దక్కించుకుంది.పలు సీరియల్స్ లో నటించిన తర్వాత.. బిగ్ బాస్(ఓటీటీ సీజన్) లోకి అడుగుపెట్టి….కొంత గుర్తింపు సంపాదించుకుంది. అటు తర్వాత బోల్డ్ ఫోటోషూట్స్ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈమె ధరించే దుస్తులు కూడా చాలా ఘోరంగా ఉంటాయి. ఒకసారి ఈమెకు స్ట్రీట్ బెగ్గర్స్ అంతా మంచి బట్టలు కొనుక్కోమని ముష్టి వేయడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.

ఇటీవల తన డ్రెస్సింగ్ పై స్పందించిన ఉర్ఫీ.. మళ్ళీ కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలించింది. “చూడండీ.. ఇదీ నా ప్రాబ్లమ్. నేను ఉన్ని దుస్తులు లేదా ఒంటినిండా వేసుకున్నప్పుడల్లా.. ఇలా అలర్జీ వస్తుంది. నాకిది పెద్ద ప్రాబ్లెమ్. నేనెప్పుడూ నిండుగా ఎందుకు బట్టలు వేసుకోవడం లేదో ఇప్పుడైనా అర్థమైందా! నిండుగా వేసుకుంటే ఇలాగే జరుగుతుంది.నాకు బట్టలంటే అలర్జీ. నా చేతులు.. కాళ్లపై దద్దుర్లు వస్తాయి చూడండి” అంటూ ఉర్ఫీ తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus