Actress: ఈ ప్రముఖ నటి కామెంట్లు వింటే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే!

  • June 23, 2023 / 07:44 PM IST

సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల గురించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు సైతం పాపులారిటీ కోసమో, క్రేజ్ కోసమో కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు, వింత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా నీనా గుప్తా యూత్ ను టార్గెట్ చేస్తూ బోల్డ్ కామెంట్లు చేయడం గమనార్హం. లస్ట్ స్టోరీస్2 ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో నటించిన నీనా గుప్తా ఈ వెబ్ సిరీస్ లో డాడీ మా రోల్ లో కనిపించనున్నారు.

గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న ఈ నటి లస్ట్ స్టోరీస్2 ట్రైలర్ విషయంలో వచ్చిన విమర్శల గురించి స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. నేటి యువత Sruగారం గురించి అవగాహనను కలిగి ఉండాలని ఆమె అన్నారు. నా మదర్ నన్ను ఎంతో స్ట్రిక్ట్ గా పెంచారని నీనా గుప్తా పేర్కొన్నారు. నాకు 13 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు తల్లీదండ్రులతో కలిసి పడుకునేదానినని ఆమె అన్నారు.

ఆ సమయంలో, ఆ వయస్సులో నాకు Sruగారం గురించి ఏమీ తెలియదని నీనా గుప్తా చెప్పుకొచ్చారు. శృంగారం గురించి మా అమ్మ నాకు ఏమీ చెప్పలేదని ఆమె అన్నారు. ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూడటానికి కూడా కుటుంబ సభ్యుల నుంచి అనుమతి లభించేది కాదని నీనా గుప్తా కామెంట్లు చేశారు. నేను కాలేజ్ లో చదువుకునే టైమ్ లో ముద్దు పెట్టుకుంటే గర్భవతి అవుతాననే భావన ఉండేదని ఆమె తెలిపారు.

పెళ్లి సమయంలో మాత్రమే Sruగారం గురించి కొంత సమాచారం ఇచ్చేవారని (Actress) నీనా గుప్తా పేర్కొన్నారు. ఇప్పటికీ కొన్నిచోట్ల ఇదే విధంగా జరుగుతోందని నీనా గుప్తా అన్నారు. నీనా గుప్తా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నీనా గుప్తాకు రాబోయే రోజుల్లో సైతం మరిన్ని సక్సెస్ లు దక్కాలని ఆమె కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus