Star Actress: వైరల్ అవుతున్న అలనాటి హీరోయిన్ కామెంట్స్!

గోల్డెన్ ఎరాలో స్టార్ హీరోలుగా పిలవబడే వారిలో ఒకరు రెబెల్ స్టార్ కృష్ణం రాజు. ఈయనకి ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభం లో ఈయన ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తూ వచ్చాడు. కరుడుగట్టిన విలన్ గా పాపులారిటీ ని సంపాదించిన తర్వాత స్టార్ హీరో గా అది కూడా మాస్ హీరో గా ఎదగడం అనేది సాధారణమైన విషయం కాదు. కృష్ణం రాజు అలా ఎదిగి చూపించాడు. రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగాడు.

కేవలం హీరో గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ఆయన ఎన్నో సంచలనాత్మక చిత్రాలను నిర్మించారు. ఆయన స్థాపించిన గోపి కృష్ణ బ్యానర్ ఇప్పటికీ కొసంగుతూ, భారీ బడ్జెట్ సినిమాలను తీస్తుంది అంటే అదంతా కృష్ణం రాజు గారి కష్ట ఫలితం అనే చెప్పాలి. కేవలం సినీ నటుడిగా మాత్రమే కాకుండా, రాజకీయ నాయకుడిగా కూడా ఆయన రాణించాడు.

ఇకపోతే కృష్ణం రాజు తో పని చేసిన స్టార్ హీరోయిన్స్ లో ఒకరు గీతాంజలి. ఈమె గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయనతో జరిగిన ఒక సంఘటన ని పంచుకుంది. అదేమిటంటే అప్పట్లో ఆమె కృష్ణంరాజు తో కలిసి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో కృష్ణం రాజు నెగటివ్ రోల్ లో నటించాడు. అయితే షూటింగ్ చేస్తున్న సమయం లో గీతాంజలి తో ఆయనకీ బాగా పరిచయం ఏర్పడింది అట.

ఆమె ఇష్టాయిష్టాలు కూడా తెలిసింది అట. ఆమెకి మల్లెపూలు అనే తెగ ఇష్టం, అందుకని ఆమె కోసం ప్రతీ రోజు మల్లెపూలు కొని తీసుకొచ్చి ఇచ్చేవాడట. తన భర్త రామకృష్ణ తర్వాత మల్లెపూలు తీసుకొచ్చి ఇచ్చే ఏకైక వ్యక్తి ఒక్క కృష్ణం రాజు మాత్రమే అంటూ ఆమె (Actress) మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus