పోర్నోగ్రఫీ కేసుపై నటి సంచలన వ్యాఖ్యలు!

పోర్నోగ్రఫీ వ్యవహారానికి సంబంధించిన కేసులో నటి గెహనా వశిష్ట్‌కు భారీ ఊరట లభించింది. బాలీవుడ్ ఫైనాన్షియర్ రాజ్ కుంద్రాతో మంచి రిలేషన్స్ ఉండడం, అశ్లీల చిత్రాల్లో నటిస్తూ పట్టుబడడం లాంటి ఆరోపణలున్న గెహానాను గతంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె 133 రోజులు కస్టడీలో ఉండగా.. ఎట్టకేలకు కోర్టు బెయిల్ జారీ చేసింది. అయితే ఈ వ్యవహారంలో దర్యాప్తుకి హాజరు కావాలనే కండీషన్ పెడుతూ.. ఆమెకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

ఈ బెయిల్ విషయంపై గెహానా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ”సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ నాకు మంజూరు చేసింది. విచారణకు హాజరు కావాలని చెప్పింది. సత్యమే జయిస్తుందని మొదటి నుంచి నేను చెప్తున్నా. నన్ను నమ్మండి.. నన్ను ఎవరూ తప్పదోవ పట్టించలేదు. డబ్బుల కోసం ఎవరినీ మోసం చేయలేదు. కావాలనే నన్ను కొందరు ఈ కేసులో ఇరికించారు” అంటూ చెప్పుకొచ్చింది. గతంలో ఈమె బాంబే హైకోర్టులో బెయిల్ కి దరఖాస్తు చేసుకోగా.. కోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది.

దాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేయగా.. ఇప్పుడు ఆమెకి అనుకూలంగా తీర్పు వచ్చింది. పిటిషనర్ ను అరెస్ట్ చేయకూడదని.. అయితే విచారణకు మాత్రం సహకరించాలని కోర్టు ఆమెని ఆదేశించింది. ఇక పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు, రాజ్ కుంద్రాకు కూడా రీసెంట్ గానే బెయిల్ వచ్చింది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus