బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ ఫోటోల లీక్ ఇష్యూ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఆమె పర్సనల్ స్పేస్‌లో, పర్మిషన్ లేకుండా తీసిన ఈ ఫోటోలపై నెటిజన్లు, సెలబ్రిటీలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ టైమ్‌లో కత్రినాకు అండగా నిలుస్తూ, ఆ ఫోటోలు తీసిన వాళ్లపై స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఫైర్ అయింది.కత్రినా ప్రైవసీకి భంగం కలిగించడంపై సోనాక్షి సిన్హా చాలా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయింది.
Katrina Kaif
ఒక మహిళ తన ఇంట్లో ఉన్నప్పుడు, ఆమె అనుమతి లేకుండా ఫోటోలు తీయడం చాలా దారుణం అని చెప్పింది. ‘ఇలాంటి పనులు చేసే వాళ్లు క్రిమినల్స్‌తో సమానం, వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యక్తిగత హద్దులను గౌరవించడం నేర్చుకోండి’ అంటూ కౌంటర్ ఇచ్చింది. రీసెంట్‌గా సోనాక్షి సిన్హా కూడా ఇలాంటి ఫేక్ న్యూస్‌తో ఇబ్బంది పడింది.
ఆమె పెళ్లి తర్వాత, ‘జటాధర’ అనే తెలుగు సినిమా కోసం బరువు పెరగడంతో, ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ, తను ప్రెగ్నెంట్ కాదని ఆమె క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. బహుశా, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై ఇలాంటి రూమర్స్, చొరబాట్లు ఎలా ఉంటాయో తెలిసే సోనాక్షి.. కత్రినా విషయంలో ఇంత స్ట్రాంగ్ గా స్పందించి ఉండవచ్చు.
గతంలో అలియా భట్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా.. ఆమె బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ టైంలో అలియా కూడా ఇలాగే ఫైర్ అయ్యింది. చాలా మంది స్టార్ హీరోయిన్ల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వివరాలు ఇలా లీక్ అయినప్పుడు.. వాళ్ళు ఫైర్ అవ్వడం కామన్. కానీ ఈసారి కత్రినా విషయంలో సోనాక్షి మద్దతు పలకడం అనేది చెప్పుకోదగ్గ విషయం.