ట్వీట్ తో జాగ్రత్తలు చెబుతోన్న నటి!

సినిమా సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు.. హాట్ ఫొటోషూట్స్ లో పాల్గొంటూ వాటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు. ప్రముఖ బుల్లితెర నటి, బాలీవుడ్ హీరోయిన్ హీనా ఖాన్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ పెట్టిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

ఇంతకీ ఆ ట్వీట్ లో హీనా ఏమని రాసిందంటే.. ‘కొంచెం కూడా సున్నితత్వం, సభ్యత, మర్యాద లేని మనుషులు ఎన్నో విధాలుగా వాళ్ల బౌండరీస్ తెలియకుండా మన లైఫ్ లో వచ్చేస్తుంటారు. అలాంటి వారు అవసరం లేకుండా.. నీ పనిలో కలుగజేసుకొని, నువ్ హర్ట్ అయ్యేలా చేస్తుంటారు. వారికంటూ ఎలాంటి లిమిట్స్ పెట్టుకోకుండా పక్కవారి జీవితాన్ని డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వారిని మనమే లిమిట్స్ లో పెట్టారు. వారికి దూరంగా ఉండాలి.

బౌండరీస్ పెట్టుకోవడమనేది మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది’ అంటూ పోస్ట్ చేసింది. దీనికి పీస్(ప్రశాంతత) అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. సడెన్ గా హీనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆసక్తి నెలకొంది. ఇంతకీ హీనా ఎవరికి వార్నింగ్ ఇచ్చిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. బుల్లితెర నటిగా సత్తా చాటిన ఆమె హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తోంది. అంతేకాదు పలు రియాలిటీ షోలలో కంటెస్టెంట్ గా అలరిస్తుంటుంది.

ఇటీవల ఆమె డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. పలు వెబ్ సిరీస్, సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నిర్మాత రాఖీ జైస్వాల్ తో డేటింగ్ చేస్తోంది. హీనాఖాన్ బిగ్ బాస్ సీజన్ 11లో కంటెస్టెంట్ గా వెళ్లిన సమయంలో గెస్ట్ ఎపిసోడ్ లో భాగంగా హౌస్ లోకి వచ్చిన రాఖీ జైస్వాల్ ఆమెకి ప్రపోజ్ చేశారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus