సినిమాలకు దూరం కానుందా..వైరల్ అవుతున్న ఫోటో..!

ప్రముఖ దర్శకుడు శంకర్‌ వారసురాలు అదితి శంకర్‌ ఇండస్ట్రీలో మంచి అవకాశాలే దక్కించుకుంటోంది. స్టార్‌ హీరో కార్తీకి జంటగా విరుమాన్‌ చిత్రంతో వెండితెరకు కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ తొలి మూవీతోనే ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత శివకార్తికేయన్‌ సరసన మావీరన్‌ చిత్రంలో నటించి మెప్పించింది. రెండు బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో ఇండస్ట్రీలో మరింత దూసుకుపోయింది. వరుస అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలున్నట్లు తెలుస్తోంది. అయితే అదితిని డాక్టర్‌గా చూడాలన్నది శంకర్‌ దంపతుల కోరిక అని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆమె వైద్య విద్య కూడా పూర్తి చేసింది. కానీ తనకు నటన అంటే ఇష్టం ఉండటంతో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తన ప్రయత్నంలో సక్సెస్‌ అయింది కూడా! తాజాగా ఈ బ్యూటీ డాక్టర్‌గా మారి షాకిచ్చింది. సర్జరీ చేయడానికి వైద్యులు కోట్‌ వేసుకుని, గ్లౌజులు ధరించి, తలకు క్యాప్‌ పెట్టుకుని ఎలాగైతే రెడీ అవుతారో అచ్చంగా అలాగే తయారైంది. ఈ ఫోటోను ‘డాక్టర్‌. A’ అన్న క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో అదితి శంకర్‌ నటనకు గుడ్‌ బై చెప్పనున్నారనే టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆమె డాక్టర్‌ దుస్తులు ధరించిన ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న ఫొటోలు వైరల్‌ అవ్వడమే ఇందుకు కారణం కావచ్చు. అయితే ఆమె నిజంగానే నటనకు గుడ్‌ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా? లేక ఏదైనా చిత్రంలోని ఫొటోలను సామాజి మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా కథానాయకగా సక్సెస్‌ బాటలో పయనిస్తున్న (Aditi Shankar) అదితి శంకర్‌ నటనకు గుడ్‌ బై చెబుతున్నారన్న వార్త అభిమానులకు నమ్మశక్యంగా లేదు. అయితే ఈ విషయమై ఆమె సైతం మౌనం వహిస్తున్నారు. అయితే ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో ఉండటానికి ఇష్టపడే అదితి శంకర్‌ చేస్తున్న కొత్తరకం పబ్లిసిటీ స్టంట్‌గా కొందరు భావిస్తున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus