సీనియర్ స్టార్ కమెడియన్ అయినటువంటి శ్రీ లక్ష్మి అందరికీ సుపరిచితమే..! ఇలా చెప్తే అర్థం కాదేమో.. ‘అబ్బ దబ్బ జబ్బ’ అంటూ పాపులర్ అయిన నటి అంటే ఇట్టే గుర్తుపడతారేమో. వందల సినిమాల్లో నటించి పాపులర్ అయిన ఆమె ఇప్పటికీ కొన్ని మీమ్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ‘బాబు చిట్టి’ అంటూ ఆమె పలికిన డైలాగ్ తో వచ్చిన మీమ్ బాగా పాపులర్. రెండు దశాబ్దాల పాటు శ్రీలక్ష్మీ తన నటనతో, కామెడీతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
అయితే ఈమె సినీ బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ..’నన్ను కూడా తొక్కేసేవారు’ అంటూ ఈమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ.. “మా నాన్నగారు అమర్నాథ్ అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో ఆయన హీరోగా ఓ వెలుగు వెలిగారు. కానీ అనారోగ్య సమస్యల వల్ల ఆయనకు అవకాశాలు తగ్గాయి.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించడానికి ఆయన ఒప్పుకోలేదు.
అందుకు నేను (Actress) సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. నాకు నటన తెలీదు. అయినా నాకు వేరే మార్గం తోచలేదు. అప్పట్లో సెట్లో నాపై చాలామంది జోకులు వేసుకునేవారు. నేను సరదాగానే తీసుకునేదాన్ని. ‘పాపం అమర్నాథ్ గారి అమ్మాయి .. వేరే ఆప్షన్ లేక తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాల్లోకి వచ్చింది .. బాగా చేస్తుంది’ అనే సాఫ్ట్ కార్నర్ నా పై ఉండేది. అలా కాకుండా నేను కొంచెం ఇగో ప్రదర్శించినా నన్ను తొక్కేసేవారు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది శ్రీలక్ష్మీ.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!