జగపతి బాబు హీరోగా ఏ.ఎం.రత్నం డైరెక్షన్లో తెరకెక్కిన ‘పెద్దరికం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది సుకన్య. ఆ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత రాజశేఖర్ తో ‘అమ్మ కొడుకు’ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. అయితే 1996 లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసిందనే చెప్పాలి. ఆ చిత్రంలో పెద్ద కమల్ హాసన్ సరసన.. వృద్ధురాలి పాత్రలో సుకన్య పలికించిన హావా భావాలు అద్బుతమనే చెప్పాలి.
దాంతో తరువాత ఆమెకు తమిళంలో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఆ టైంలో తెలుగులో ఈమె పెద్దగా సినిమాలు చెయ్యలేదు. ఇక 2002లో శ్రీధరన్ రాజగోపాలన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది సుకన్య. అయితే కారణాలు ఏంటో తెలీదు కానీ 2003 లోనే విడాకులు తీసుకుంది.వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే అప్పటి నుండీ ఈమె పై రకరకాల ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వ్యభిచారం కేసులో ఇప్పటికే ఈమె 2, 3 సార్లు అరెస్ట్ అయ్యిందని కూడా ప్రచారం జరిగింది.
సినిమా అవకాశాల కోసం వచ్చే యువతీ యువకులను .. వ్యభిచారంలోకి దింపుతుంది అని ఈమె పై ఆరోపణలు వచ్చాయి. ఆర్ధిక పరిస్థితులు బాగోకపోవడం వల్లే ఈమె అలాంటి చెడుపనులు చేసేదని కొందరు చెబుతుంటారు. వాటిలో ఎంతవరకూ నిజముందో తెలీదు కానీ.. ఇప్పుడైతే సుకన్య సినిమాల్లో నటిస్తూనే ఉంది. ‘మున్నా’ సినిమాలో ప్రభాస్ కు పిన్నిగా నటించింది తరువాత ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ బాబుకి అమ్మగా కూడా నటించింది.
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!