Actress: భర్త నుండి సెపరేట్ గా ఉంటున్న స్టార్ హీరోయిన్.. మేటర్ ఏంటంటే?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఆసిన్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే నాగార్జునతో ‘శివమణి’ , బాలకృష్ణతో ‘లక్ష్మీ నరసింహ’, వెంకటేష్ తో ‘ఘర్షణ’, పవన్ కళ్యాణ్ తో ‘అన్నవరం’, ప్రభాస్ తో ‘చక్రం’ వంటి పెద్ద సినిమాల్లో నటించే ఛాన్స్ లు దక్కించుకుంది.ఆసిన్ కు తెలుగుతో పాటు తమిళ,హిందీ సినిమాల్లో కూడా ఎక్కువ ఛాన్స్ లు వచ్చాయి.

ఇదిలా ఉండగా.. 2016 లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది ఆసిన్. ఈమె భర్త మైక్రో మాక్స్ కంపెనీ కి సి.ఈ.ఓ అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. ఆసిన్ కు ఓ పాప. ఆసిన్- రాహుల్ ల వివాహం జరగడానికి ముఖ్య కారణం హీరో అక్షయ్ కుమార్ అని అప్పట్లో టాక్ నడించింది. ఇదిలా ఉండగా.. త్వరలో ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ఇప్పుడు గాసిప్స్ మొదలయ్యాయి.

విషయమేంటంటే రాహుల్ శర్మ కొన్నాళ్లుగా వేరే అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడట. ఈ విషయం తెలుసుకున్న ఆసిన్.. ఒకటి రెండు సార్లు హెచ్చరించిందట. అయినా అతను వినకుండా తనకు నచ్చినట్టు చేస్తుండటంతో.. ఈమె అతని నుండి సెపరేట్ అయ్యి దూరంగా ఉంటుందట. తనకు పాప ఉన్నాసరే… ఆసిన్ విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ పై ఆమె (Actress) స్పందించింది లేదు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus