ఒకప్పటి హీరోయిన్లు ఇప్పటి సినిమాల్లో తల్లి, అత్త.. వంటి పాత్రలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అవి బాగా వస్తే.. వాళ్లకి మరిన్ని అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఒకప్పటి హీరోయిన్ గౌతమి మాత్రం.. ఎందుకో సెకండ్ ఇన్నింగ్స్ లో రాణించలేకపోతుంది. గతంలో ‘గాంధీనగర్ రెండో వీధి’ ‘శ్రీనివాస కళ్యాణం’ ‘బజార్ రౌడీ’ ‘భార్యాభర్తలు’ ‘తోడల్లుళ్లు’ ‘ఆగస్టు 15 రాత్రి’ ‘ప్రచండ భారతం’ ‘కృష్ణ గారి అబ్బాయి’ ‘అన్న తమ్ముడు’ ‘అగ్గిరాముడు’ ‘బామ్మ మాట బంగారు బాట’ ‘చైతన్య’ ‘చక్రవ్యూహం’ ‘సంకల్పం’ ‘అన్న’ ‘పల్లెటూరి మొగుడు’ ‘ద్రోహి’ ‘అదిరిందయ్యా అల్లుడు’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
తమిళంలో కూడా హిట్ సినిమాలు చేసింది. అయితే కమల్ హాసన్ తో ప్రేమ, సహజీవనం వంటి వ్యవహారాలతో ఈమె కెరీర్ ను సీరియస్ గా తీసుకోలేదు. దీంతో హీరోయిన్ గా త్వరగానే ఫేడౌట్ అయిపోయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు క్రేజీ సినిమాల్లో నటించినా అవి సక్సెస్ కాలేదు. 2016 లో వచ్చిన ‘మనమంతా’ సినిమాతో ఈమె తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మనమంతా’ ‘శాకుంతలం’ ‘అన్నీ మంచి శకునములే’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటించింది.
అవి సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈమె (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాపైనే గౌతమి చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తాయి. లేదంటే కష్టం. మరి ఏమవుతుందో చూడాలి.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!