Yash: యశ్‌ కొత్త సినిమా… ఆ భామ హీరోయిన్‌ కాదట… ట్విస్ట్‌ ఏమైనా ఉందా?

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ (Kareena Kapoor) సౌత్‌ సినిమాలోకి వస్తోంది అంటూ… గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. యశ్‌ (Yash) కొత్త సినిమా ‘టాక్సిక్‌’లో (Toxic) ఆమె కథానాయికగా నటించనుంది అని ఆ పుకార్ల సారాంశం. అయితే ఆమె సినిమాలో ఉంది! లేదు! అంటూ గత కొన్ని రోజులుగా రకరకాల డౌట్స్‌ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌ కాదట… కీలక పాత్ర కోసం తీసుకుంటున్నారట.

‘కేజీయఫ్‌ 2’ (KGF2) తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని యశ్‌ చే్తున్న సినిమా ‘టాక్సిక్‌’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) ఈ సినిమాను డైరక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండగా… ఓ హీరోయిన్‌గా కరీనాను తీసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే యశ్‌ సరసన సీనియర్‌ హీరోయిన్‌ వద్దంటూ అభిమానులు టీమ్‌ను సోషల్‌ మీడియా ద్వారా వేడుకున్నారు. మరి వారి కోరిక టీమ్‌ విన్నాదో… లేక ముందుగానే అనుకున్నారో కానీ… కరీనా హీరోయిన్‌ కాదని ఇప్పుడు అంటున్నారు.

ఈ సినిమాలో యశ్‌కు సోదరి పాత్ర కోసం ఆమెను తీసుకున్నారట. హీరోకు సమానంగా హీరోయిక్‌గా ఉండే ఆ పాత్రకు కరీనా అయితే పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని అనుకుంటున్నారట. దీంతో హీరోయిన్లుగా ఇద్దరూ యంగ్‌ భామలే ఉంటారట. ప్రేమకథలు, యాక్షన్‌, కామెడీ.. ఇలా జానర్‌ ఏదైనా ప్రేక్షకుల్ని రంజింపజేసే హీరోయిన్లలో అగ్రకథానాయిక కరీనా కపూర్‌ ఒకరు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 17 ఏళ్లు అయినా ఇంకా కొత్త హీరోయిన్‌ అనేలానే కనిపిస్తూ, అలరిస్తుంటుంది.

ఇటీవల సోషల్‌ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ… తన రాబోయే సినిమా గురించి ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకుంది కరీనా. ‘‘త్వరలోనే నేను ఓ భారీ సినిమాతో దక్షిణాది చిత్రసీమలో అడుగుపెడుతున్నాను. అది పాన్‌ ఇండియా సినిమా. మొదటిసారి ఇలాంటి ఓ సినిమాలో పనిచేస్తున్నాను’’ అని చెప్పింది. దీంతో ఆ సినిమా యశ్‌ ‘టాక్సిక్‌’ అని సోషల్‌ మీడియాలో అభిమానులు నిర్ణయించేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus