సినిమా కోసం పోటీపడుతున్న భామలు..!

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే దానికున్న క్రేజ్ సపరేట్ అనే చెప్పాలి. అందుకే, ఇప్పుడు కుర్రహీరోయిన్స్ సైతం మెగాస్టార్ సరసన యాక్ట్ చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు భామలు బాస్ తో సిల్వర్ స్క్రీన్ షేర్ చేస్కోవడానికి పోటీ పడుతున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు భామలు అనుకుంటున్నారా.. ఒకరు రకుల్ ప్రీత్ సింగ్, ఇంకొకరు శృతిహాసన్. ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. లూసిఫర్ రీమేక్, వేదాళం రీమేక్ సినిమాలతో పాటుగానే డైరెక్టర్ బాబీ డైరక్షన్ లో మెగాస్టార్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇద్దరు పేర్లను పరిశీలిస్తోందట మూవీ టీమ్.

శృతిహాసన్, రకుల్ ప్రీత్ ఈ లిస్ట్ లో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే శృతి క్రాక్ హిట్ తో జోష్ లో ఉంది. అదీకాకుండా పవర్ స్టార్ తో కలిసి మూడు సినిమాలు చేసింది. ఇక మెగాస్టార్ తో కలిసి చేస్తే ఆలోటు కూడా తీరుతుంది భామకి. ఇక మెగా హీరోల్లో అల్లు అర్జున్ తో రేసుగుర్రం, రామ్ చరణ్ తో ఎవడు సినిమాల్లో చేసి మెప్పించింది శృతి. మధ్యలో గ్యాప్ తీస్కున్నా కూడా కమ్ బ్యాక్ మూవీలో తన గ్లామర్ తో ఇరగదీసింది. ఇప్పుడు మెగాస్టార్ సరసన కూడా చేస్తే మెగా టాప్ హీరోలతో నటించనట్లుగా అవుతుందని ఆశపడుతోంది. మరోవైపు రకుల్ కూడా మెగా హీరోల్లో రామ్ చరణ్ తో కలిసి రెండు సినిమాల్లో చేసింది.

ధ్రువ, బ్రూస్ లీ సినిమాల్లో మంచి పెర్ఫామన్స్ ఇచ్చింది. అంతేకాదు, బ్రూస్ లీలో మెగాస్టార్ తో కలిసి యాక్టింగ్ కూడా చేసింది. అంతేకాదు, మెగా కాంపౌండ్ లో అల్లు అర్జున్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తో విన్నర్ సినిమాలో చేసింది. ఇక అమ్మడి లిస్ట్ లో మిగిలింది కేవలం పవర్ స్టార్ , మెగాస్టార్ ఇద్దరు మాత్రమే. అందుకే ఇప్పుడు బాబీ డైరక్షన్ లో చిరంజీవి సరసన నటించాలని రకుల్ పాప ఆశపడుతోంది. ఇప్పటికే సీనియర్ హీరో నాగార్జునతో మన్మథుడు 2 లో నటించిన అనుభవం ఎలాగో ఉంది. ఇప్పుడు చిరుతో కూడా నటిస్తే అటు సీనియర్ ఇటు కుర్రహీరోలతో నటించిన భామల లిస్ట్ లో తన పేరు కూడా యాడ్ అయిపోయింది. మరి వీరిద్దరిలో డైరెక్టర్ బాబీ, చిరుల చూపు ఎవరుపై ఉన్నది అనేది తెలియాలి. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus